వైరల్ వీడియో.. లతామంగేష్కర్ డ్యూయెట్ కు ఈ జంట సూపర్ రీల్..

By SumaBala BukkaFirst Published May 22, 2023, 11:59 AM IST
Highlights

క్రాంతి చిత్రంలోని లతా మంగేష్కర్ పాటకు ఓ వృద్ధ జంట లిప్ సింక్ చేస్తూ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. 

ఓ వైరల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. రెండు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇంతకీ అంతగా వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముంది అంటే... ఓ పెద్దవయసు జంట చక్కటి డ్యూయెట్ కు లిప్ సింక్ చేసి ఓ రీల్ చేశారు. అందులో వాళ్ల ఎక్స్ ప్రెషన్స్.. పాటకు వాళ్లిచ్చిన లిప్ సింక్ అందరినీ అబ్బురపరుస్తోంది. 

రీల్స్.. సోషల్ మీడియాను ముంచెత్తుతున్న మాధ్యమం. తమలోని టాలెంట్ ను ఏదో రకంగా లోకానికి తెలియజేయడానికి చాలామంది రీల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇందులో కపుల్ రీల్స్ స్పెషల్ అట్రాక్షన్. భార్యభర్తలిద్దరికీ ఒకే అభిరుచి ఉండి రీల్స్ చేయడం గొప్ప విషయమే. ఇలాంటి వాటిల్లోకే వస్తుంది ఇప్పుడీ రీల్. అందులే అది నెటిజన్ల మనసును దోచుకుంటుంది. 

వారు తీసుకున్న పాట కూడా పాత బాలీవుడ్ సినిమా క్రాంతిలో లతామంగేష్కర్ పాడిన డ్యూయెట్. ఈ వీడియోను నందా చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అందులో ఓ పెద్దాయన కూర్చుని ఉండగా.. భార్య అతడిని ఉత్సాహపరుస్తూ పాటందుకుంటుంది.. దీనికి అతను కూడా చక్కగా లిప్ సింక్ చేశాడు. హావభావాలతో పాటు మ్యాచ్ చేయడం క్యూట్ గా ఉంది. 

అతడిని భార్య ఉత్సాహపరుస్తూ.. చేతి కదలికలు చేయడానికి సహాయం చేస్తుంది. లతా మంగేష్కర్, నితిన్ ముఖేష్ పాడిన ‘జిందగీ కి నా టూటే లడి’ అనే పాటకు లిప్-సింక్ చేస్తున్నప్పుడు ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తారు. ఈ జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

click me!