ఈ పాము ఖరీదు రూ.కోటిపైనే, ఎమిటో అంత ప్రత్యేకం

By telugu teamFirst Published Dec 31, 2019, 1:00 PM IST
Highlights

 ‘రెడ్ సాండ్ బో’ అనే జాతికి చెందిన అరుదైన పామును తరలిస్తున్న ఈ ముఠాని సర్సింఘర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్‌లో ఈ పాము ఖరీదు దాదాపు రూ.1.25 కోట్లుగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

ఈ ఫోటోలో కనిపిస్తున్న పాముని చూశారా..? చూడటానికి సాధారణంగానే ఉన్నా.. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అరుదైన జాతికి చెందిన ఈ పాముకి డిమాండ్ చాలా ఎక్కువ. దీని ఖరీదు రూ.కోటిపైనే ఉంటుందంటే నమ్ముతారా కానీ అదే నిజం.

ఈ పాముని పట్టుకొని ఎవరికీ తెలియకుండా అమ్ముతున్న ముఠాలు కూడా ఉన్నాయి. అరుదైన జాతికి చెందిన ఈ పాముని తరలిస్తూ ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా ఒకటి తాజాగా పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

 ‘రెడ్ సాండ్ బో’ అనే జాతికి చెందిన అరుదైన పామును తరలిస్తున్న ఈ ముఠాని సర్సింఘర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్‌లో ఈ పాము ఖరీదు దాదాపు రూ.1.25 కోట్లుగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది విషపూరితమైన సర్పం కాదు. 

విషం లేని పాములను సాధారణంగా కొన్ని అరుదైన రకమైన ఔషధాలు, కాస్మెటిక్స్ తయారు చేసేందుకు, చేతబడి చేసేందుకు వినియోగిస్తారు. దీని వల్ల వారికి అదృష్టం, లాభం కలుగుతుందని కూడా వాళ్లు నమ్ముతారు. ఇందుకోసమే వాళ్లు దాన్ని తరలించే ప్రయత్నం చేశారు.
 
అయితే సమాచారం అందుకున్న పోలీసులు పామును తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. వీరిపై జంతసంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

click me!