రైల్లో మానవత్వం పరిమిళించింది. పురిటి నోప్పులతో బాధపడుతున్న ఓ గర్భీణికి పురుడుపోశారు ఇద్దరూ ఆర్మీ ఆఫీసర్స్. తల్లీబిడ్డల ప్రాణాల్ని కాపాడిన లేడీ ఆఫీసర్లకు అభినందనలు వెల్లువెత్తాయి.
దేశాన్ని కంటి రెప్పల కాపాడే సైనికుడు బార్డర్‌లో ఉన్న వెలుపల ఉన్న సరే తన కర్తవ్యాన్ని ఏప్పటికీ మార్చిపోరు. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణగా నిలిచింది. ఇద్దరు ఇండియన్ ఆర్మీ మహిళా కెప్టెన్లు.. పురిటి నోప్పులతో బాధపడుతున్న ఓ స్త్రీ వేధనను ఆర్ధం చేసుకుని ఓ బిడ్డకు పురుడు పోసి దట్స్ ఇండియన్ అని ప్రూవ్ చేశారు. పౌరులకు కష్టం వస్తే ఆర్మీ అక్కున చేర్చుకుంటుందనే విషయాన్నిఆ ఆర్మీ మహిళా వైద్యాధికారులు మరోసారి నిరూపించారు.
ఇండియన్ ఆర్మీకి చెందిన ఇద్దరూ అధికారులు కెప్టెన్ లలిత, కెప్టెన్ అమన్‌దీప్ హౌరా ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు చాలా వేగం దూసుకుపోతుంది. అందరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అంత నిశబ్ధం ఇంతలో ఓ గర్భిణికి సడెన్ గా నొప్పులు మొదలయ్యాయి.
undefined
మెల్లగా మెల్లగా ఆ నోప్పి తీవ్రమవుతుంది. ఆమె తట్టుకోలేకపోతుంది. ఇంకో గంట అగితే కానీ నెక్ట్స్ స్టెషన్ రాదు. ఆమెతో ఉన్న వారికి ఏం చేయాలో ఆర్ధం కావడం లేదు.అంతలో ఇద్దరు లేడీ ఆర్మీ ఆఫీసర్స్ చెయి ఆ మహిళ కడుపును తాకాయి. వారు చేస్తున్న చికిత్స ఆ మహిళకు క్రమంగా ఆమెకు ఉపశమాన్ని ఇస్తున్నాయి. తన నెలల నిరక్షణ ఫలించబోతుంది. ఓ పండటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
ఇనాళ్ళ తను కడుపున మేసిన ఆ బిడ్డ ఆమె పంతున చేశాడు. ఆ ఆర్మీ ఆఫీసర్స్ బెర్త్ మధ్యలో ఆ మహిళ పురుడు పోసి పండిటి బిడ్డను ఆమె అక్కున చేర్చారు. విపత్కర పరిస్థితులో ఉన్న ఆ గర్భిణికి కెప్టెన్లయిన లలిత, అమన్‌దీప్ దేవతలయ్యారు. గుర్దాస్ పూర్ లోని 172వ మిలిట్రీ ఆస్పత్రిలో వీరు ఆర్మీ డాక్టర్లు గా పనిచేస్తున్నారు. సెలవుపై ఊరు వెళ్తున్న వీరు హౌరా ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఆపదలో ఉన్న ఓ నిండు గర్బీణికి సహాయం అందించిన వీరికి అభినందులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్, ఇతర ఆర్మీ అధికారలు కూడా వారిని అభినందించారు. ఆ మహిళా కెప్టెన్లు చేసిన పనిని దేశం మెచ్చుకుంటున్నది.