వన్యప్రాణులను కాపాడి మనలో ఇంకా మనుషులలో మానవత్వం ఉందని నిరూపించాలి. మూగ జీవులు పై దయ, ప్రేమ చూపి వాటి పరిరక్షించడం మన అందరి బాధ్యత.
మానవుని విపత్కర పరిణామాలు జీవ వైవిధ్యానికి పెనుఘాతంగా మారాయి. ఏటా ఏటా పెరుగుతున్న జనాభా కావల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం అరుదైన జీవ వైవిధ్యాన్ని పణంగాపెట్టి అర్థరహితంగా అభివృద్ధి కార్యక్రమాలను మనిషి రూపొందిస్తున్నాడు . ఈ తరుణంలో అనేక వృక్ష, పక్షి జంతు జాతులు ముప్పు ముంగిట నిలుచున్నాయి. జంతువుల జాడ తగ్గి అడవులు వెలవెలపోతున్నాయి.
అరుదైన పక్షులు,పులులు సింహలు,రైనోలు అంతరించిస్తున్న జంతు జాబితిలో చేరుతున్నాయి. కరుడుగట్టిన వేటగాళ్లు అల్ప సంఖ్యలో ఉండే అటవీ సిబ్బందిని ఎదురించి జీవాల ప్రాణాలు తీసున్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశాలు జంతు జాతుల పరిరక్షణకు నడుం బిగించాయి. ఇందులో బాగంగా వేటగాళ్ళ చేత చిక్కి అంతరించినపోతున్న రైనోలను కాపాడుకోవడానికి ఆఫ్రికా దేశాలు సిద్దమైయాయి. దీని కోసం బ్రిటిష్ సైనికుల సహాయాన్ని తీసుకుంటున్నాయి.
undefined
దక్షిణాఫ్రికా అడువుల్లో నల్ల ఖడ్గమృగాలకు ముప్పు పోంచి ఉన్న నేపథ్యంలో వాటిని అక్కడి నుండి మాలావిలోని లివోండే నేషనల్ పార్కుకు తరిలించారు. వేటగాళ్ళ చేతిలో చిక్కి తీవ్రంగా గాయపడిన 17 రైనోలను అక్కడి నుండి విమానాల ద్వారా ఈ పార్కకు చేర్చారు. అంతే కాకుండా మాలావిలోని జంతురక్షణ దళాలకు వాటి పరిరక్షణపై బ్రిటిష్ సైనికులు శిక్షణ కూడా ఇచ్చారు.
"దక్షిణాఫ్రికా నుంచి బ్రిటిష్ ఆర్మీ బ్లాక్ రైనోలను విజయవంతంగా లివోండే నేషనల్ పార్కుకు తరలించింది. సైనికులు చాకచక్యంతో సెవ్ రైనోస్ ప్రాజెక్ట్ పూర్తి చేశారని" ఈ ఆపరేషన్‌ను పరివేక్షించిన మేజర్ జెజ్ ఇంగ్లాండ్ మీడియాకు తెలిపారు.
"జంతు పర్యవేక్షణలో లివోండే రేంజర్ల నైపుణ్యాలను తెలుసుకోవడంతో పాటు వాటిని కాపాడకోవడంలో ఎలాంటి చర్యలు చేపట్టాలో వారికి సృష్టంగా వివరించాం. అలాగే దట్టమైన అటవి ప్రాంతంలో, ప్రతికూల వాతావరణంలో రేంజర్లకు పెట్రోలింగ్ చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరిచమని" జెజ్ తెలిపారు.
వన్యప్రాణుల అక్రమ వాణిజ్యాన్ని అడ్డుకోవడంలో యుకె ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. 2014 నుంచి 2021 వన్యప్రాణుల సంరక్షణ కోసం 36 మిలియన్ డాలర్ల ఫండ్‌ను కేటాయించినట్లు యుకె ప్రభుత్వం తెలిపింది. జంతువులకు సరిహద్దలు లేవని " ట్రాన్స్-బౌండరీ" పేరుతో ఎక్కడైతే వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న ప్రాంతం నుంచి మరో దేశానికి తరిలించే ప్రయత్నాలు చేస్తొంది. వన్యప్రాణులను కాపాడి మనుషులలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తోంది.
భూమిపై నివసించే ప్రతి ప్రాణికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. తాము స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నా నినాదాన్ని అడవి జంతువులు గడ్రీంపులతో వినిపిస్తున్నాయి. మమ్మల్ని చంపేస్తారా.. ఇక్కడ మేము బతకూడదా! అంటూ జంతు అర్థనాదాన్ని నోరులేని ప్రాణుల ప్రపంచానికి చెబుతున్నాయి.కావున సకల జీవుల జీవనాధారమైన అభయారణ్యాలను, అడవులను, వన్యప్రాణులను మనం సంరక్షించాలి.