పెంపుడు కుక్కతో చిన్నారి దాగుడుమూతలాట.. ఎంతచక్కగా వింటుందో చూడండి...

By Bukka SumabalaFirst Published Aug 11, 2022, 12:44 PM IST
Highlights

పెంపుడు కుక్క ఓ చిన్నారితో దాగుడు మూతలు ఆడుతున్న వీడియో ఒకటి ఇప్పుు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పెట్ డాగ్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్నారులు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అవి చేసే చిలిపి అల్లరి, పిల్లల్ని బాధ్యతగా చూసుకునే విధానం, తోటి జంతువులతో సరదా పోట్లాటలు.. ప్రతీ ఒక్కటీ అడోరబుల్ గా ఉంటాయి. అందుకే పెట్ డాగ్స్ వీడియోలు అనగానే వ్యూస్ వేలల్లో ఉంటాయి. ఇప్పుడు అలాంటి  ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. 

ఓ చిన్నారికి ఓ పెంపుడు కుక్క ఉంది. దాన్ని ముద్దు చేయడం, గారాబం చేయడం.. ఆడుకోవడం మామూలే.. అదే ఆ చిన్నారి కూడా చేసింది. అయితే.. ఆ చిన్నారితో ఆ కుక్క ప్రవర్తించిన తీరే ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీటికి మన భాష, మనసు ఇంత బాగా అర్థం అవుతాయా అంటూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

వార్నీ... స్మార్ట్ ఫోన్ కనిపిస్తే కోతిపిల్లకూడా ఆగడం లేదు...

ఓ చిన్నారి తన పెంపుడు కుక్కతో దాగుడుమూతలు ఆడాలనుకుంది. అది కూడా తోటి స్నేహితులతో ఆడుకున్నట్టుగా.. అందుకే ముందుగా దానికి దాగుడుమూతలు ఎలా ఆడాలో చెప్పింది. అంతా ఆ బుజ్జికుక్క కూడా చక్కగా విన్నది. చిన్నారి వెళ్లి లెక్కపెట్టూ.. అనగానే.. వెనక్కి పరిగెత్తి గోడకు రెండు కాళ్లు ఎత్తిపెట్టి.. కళ్లు మూసుకుని.. అంకెలు లెక్కపెట్టే ఫోజులో నిలబడింది. ఈ సమయంలో చిన్నారి వెళ్లి గదిలో దాక్కుంది. దాక్కోవడం అయిన తరువాత లోపల్నుంచి ఇంక పట్టుకో.. అన్నట్టుగా చెప్పింది. ఆమె మాట వినగానే అప్పటివరకు కళ్లు మూసుకున్న శునకరాజం వెంటనే వెనక్కి తిరిగి.. ఆమెను కనిపెట్టేందుకు గదిలో దూరింది. 

అంత చక్కగా చిన్నారి సూచనలు వినడం... అచ్చం మనిషిలా బిహేవ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కుక్క పేరు మంకీ అని వీడియోలోని ఆ చిట్టితల్లి మాటల్లో తెలుస్తోంది. వీడియో మీద కూడా మంకీ అని వాటర్ మార్క్ వేశారు. ఈ వీడియోను తీసినవారు తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వెంటనే దీనికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘దాగుడుమూతలు ఆడడానికి ఇంతకంటే మంచి ఫ్రెండ్ ఉండదు’.. అని ఒకరంటే.. ‘ఆ అమ్మాయి చెప్పినట్టుగానే వింటుందంటే.. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి కాస్త ఆలస్యం చేసి.. చిన్నారిని సంతోషపెడుతుంది’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘మా ఇంట్లో కూడా ఇలాంటి కుక్కే ఉండేది. నేనూ దాంతో దాగుడుమూతలు ఆడేదాన్ని. అవి బాగా ఆడతాయి’ అని మరొకరు తమ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. 

 

The best friend to play ‘hide and seek’ game…

pic.twitter.com/4DrpXggJT4

— Tansu YEĞEN (@TansuYegen)
click me!