ఈ ఫొటోకు, వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా.. ఎందుకో తెలిస్తే.. మీరూ లైక్ చేస్తారు..

By Bukka SumabalaFirst Published Aug 11, 2022, 10:48 AM IST
Highlights

స్నేహా బిస్వాస్ అనే యువతి పాకిస్థాన్‌కు చెందిన ఆమె స్నేహితురాలి గురించి.. వారి మధ్య స్నేహం గురించి రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఎర్లీ స్టెప్స్ అకాడమీ సీఈవో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. స్నేహా బిస్వాస్ అనే యువతి చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ స్నేహానికి సరైన ఉదాహరణగా నిలిచింది. వీరిద్దరి స్నేహం అన్ని అడ్డంకులను అధిగమించింది. బిశ్వాస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో తన క్లాస్‌మేట్స్‌లో ఒక పాకిస్తానీ పౌరురాలి గురించి రాసిన పోస్ట్. ఫ్రెడ్షిప్ మీద ఈ అందమైన కథ అందర్నీ ఆకర్షించింది.  నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. 

ఈ పోస్ట్‌లో బిస్వాస్, పాకిస్తాన్‌కు చెందిన ఆమె స్నేహితురాలి మధ్య వికసించిన స్నేహం గురించి చక్కగా వివరించింది. “భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో పెరిగిన నాకు పాకిస్తాన్ గురించిన జ్ఞానం క్రికెట్, చరిత్ర పుస్తకాలు,  మీడియా కథనాలకు మాత్రమే పరిమితమైంది. ఇవన్నీ ఇరు దేశాల మధ్య శత్రుత్వం, ద్వేషం చుట్టూనే తిరిగాయి. అలా పెరిగిన నేను.. దశాబ్దాల తర్వాత నేను ఈ అమ్మాయిని కలిశాను. ఆమె పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో నా మొదటి రోజు ఆమెను కలిశాను. మేము ఒకరినొకరు ఇష్టపడటానికి 5 సెకన్లు పట్టింది. ఆ తరువాత మొదటి సెమిస్టర్ ముగిసే సమయానికి క్యాంపస్‌లో నాకు అత్యంత సన్నిహితులలో ఆమె ఒకరిగా మారింది" అని బిస్వాస్ రాసుకొచ్చింది.

గుర్గావ్ లో అమానుషం.. నైట్ క్ల‌బ్ బ‌య‌ట ఓ మ‌హిళ‌ను, ఆమె స్నేహితుల‌ను చిత‌క‌బాదిన బౌన్స‌ర్లు.. వీడియో వైర‌ల్

“మా ఇద్దరి మధ్య అనేక విషయాల్లో చర్చలు నడిచేసవి.. మా మల్టిపుల్ చాయిస్, బిర్యానీలు, ఫైనాన్షియల్ మోడల్స్, కేస్ స్టడీ ప్రిపరేషన్‌ల ద్వారా ఒకరినొకరం బాగా తెలుసుకున్నాం. సాంప్రదాయిక పాకిస్తానీ నేపథ్యంలో పెరిగిన ఆమె ఎదుర్కొన్న అనుభవాలు. నిబంధనలను ఉల్లంఘించి, వారి కలలను వెతుక్కుంటూ.. సాకారం చేసుకునే క్రమంలో ఆమెకు, ఆమె చెల్లికి ధైర్యాన్ని, మద్దతునిచ్చే తల్లిదండ్రులు ఉండడం..ఆమె అదృష్టం. అవన్నీ నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించాయి. ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే తెగువ, లక్ష్యాన్ని చేరుకోవడానికి దేనికి భయపడకపోయే తత్వం నాకు స్ఫూర్తినిచ్చాయి”అన్నారామె.

ఈ పోస్ట్‌లో వీరిద్దరూ భారతదేశం, పాకిస్తాన్ జాతీయ జెండాలను పట్టుకుని ఉన్నారు. ఆ చిత్రాన్ని చూసిన నెటిజన్లు.. ఆమె స్నేహం గొప్పదనాన్ని మెచ్చుకుంటున్నారు. వారి నిర్మలమైన హృదయాల స్నేహగీతాన్ని కొనియాడుతున్నారు. 

click me!