ఓ కోతిపిల్ల ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్ అంటే దానికున్న వ్యామోహం.. అందర్నీ ముక్కుమీద వేలేసుకుంది.. హాయిగా నవ్వుకునేలా చేస్తుంది.
మన పూర్వీకులు కోతినుంచి పుట్టారంటారు. అందుకే కొన్నిసార్లు మనుషులు కోతుల్లా ప్రవర్తిస్తే.. చాలాసార్లు కోతులు మనుషుల్లా బిహేవ్ చేస్తుంటాయి. అలాంటి ఓ క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోకు వందల్లో లైక్ లు, వ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే...
ఓ వ్యక్తి తల్లితో ఉన్న ఓ చిన్న కోతి ఫొటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ కోతి పిల్ల మాత్రం అతని దగ్గర్నుంచి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ కోతిపిల్ల తల్లి... అచ్చం మన అమ్మల్లాగే.. కోతిని వెనక్కి లాగుతుండడం.. తప్పు అలా గుంజుకోవద్దు అన్నట్టుగా.. చేయి పట్టి లాగడం.. అంతా.. చూసినవారందర్నీ.. మళ్లీ మళ్లీ ఈ వీడియో చూడాలనేట్టుగా చేస్తోంది.
undefined
ఈ ఫొటోకు, వారి స్నేహానికి నెటిజన్లు ఫిదా.. ఎందుకో తెలిస్తే.. మీరూ లైక్ చేస్తారు..
దీన్నంతా ఫొటోతీయాలని ట్రై చేసిన వ్యక్తితో ఉన్నతను వీడియో తీయగా.. ఆ తరువాత వీరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిట్టి కోతిపిల్ల కాస్తా వైరల్ అయి, సెలబ్రెటీగా మారిపోయింది. దాని పిల్ల చేష్టలు.. తల్లికోతి పెద్దరికం.. ఇప్పుడు నెటిజన్ల హృదయాల్ని గెలుచుకుంటున్నాయి. ఈ వీడియో మీద కామెంట్ల వరద పారుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షలకు వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోకు సుశాంత్ నందా పెట్టిన క్యాప్షన్ కూడా అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అతను ఈ వీడియోకు ‘యువతరం స్మార్ట్ ఫోన్లంటే పడి చచ్చిపోతున్నారు’... అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి చాలామంది నెటిజన్లు.. ‘భలే ఉంది’.. అంటూ కామెంట్లు పెట్టగా, ‘పిల్లలు ఫోన్లు కనిపిస్తే చాలు మనలోకంలో ఉండడం లేదు’.. అంటూ మరికొందరు కామెంటారు. ఇంకొకరేమో.. ’ప్రతీరోజు ఉదయం నా వంటింటి కిటికీ దగ్గర ఈ కోతులు హడావుడి ఉంటుంది. ఓ చిన్నకోతి ఇలాగే నన్ను పలకరిస్తూ, దోబూచులాడుతుంది. కానీ తల్లిమాత్రం అస్సలు ఒక్కచూపు కూడా నా వైపు విసరకుండా పోతుంది’.. అంటూ చెప్పుకొచ్చారు.
Young generation is mad with smart phones ☺️ pic.twitter.com/hFg8SH9VyZ
— Susanta Nanda IFS (@susantananda3)