కదులుతున్న రైలు ఎక్కబోయి.. ట్రాక్ మధ్యలో పడిన మహిళ.. వీడియో

By telugu news teamFirst Published Feb 17, 2020, 11:30 AM IST
Highlights

అప్పటికే జనం నిండుగా ఉండటంతో ఆమెకు రైలు ఎక్కడం వీలుకాకపోగా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆమె పడబోయింది. ఇది గమనించిన ఓ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెను బయటకు పట్టుకుని బయటకు లాగాడు. 

కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలమీదకు తెచ్చుకుంది. కాగా... ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెనును ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు ఎక్కబోయింది. అప్పటికే జనం నిండుగా ఉండటంతో ఆమెకు రైలు ఎక్కడం వీలుకాకపోగా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆమె పడబోయింది. ఇది గమనించిన ఓ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెను బయటకు పట్టుకుని బయటకు లాగాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read లవ్ అఫైర్: యువతి ప్రైవేట్ పార్ట్స్ పై తుపాకీతో కాల్పులు, మృతి...

కాగా... దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా... సదరు ప్రయాణికురాలు చేసిన పనికి నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంచెం కూడా భయం లేకుండా ఎలా రైలు ఎక్కుదామని అనుకుందంటూ తిట్టిపోస్తున్నారు.

Odisha: A woman passenger fell down in the gap between platform and train while she was trying to board a running train at Bhubaneswar Railway Station today. She was rescued by an RPF constable. pic.twitter.com/Xmi8Yg6qhK

— ANI (@ANI)

 

ఇక ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన కానిస్టేబుల్ పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళ ప్రాణాలను కాపాడిన రియల్‌ హీరో’ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.  గతంలోనూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా... మరోసారి వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.  

click me!