మరికాసేపట్లో పెళ్లి... మండపంపై వరుడిని చితకబాదిన మొదటి భార్య

By telugu news teamFirst Published Feb 13, 2020, 7:54 AM IST
Highlights

తనను దారుణంగా కొట్టిన మొదటి భార్య, ఆమె కుటుంబసభ్యులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం విశేషం. అయితే... ఈ విషయాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవడం మేలని పోలీసులు సూచించారు. తీవ్రంగా గాయపడిన వరుడిని మాత్రం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

మరికాసేపట్లో పెళ్లి... అప్పటికే అందంగా ముస్తాబైన వధూ, వరులు మండపంపై అడుగుపెట్టారు. బంధువులంతా పెళ్లి తంతుని కనులారా వీక్షిస్తున్నారు. ఇంతలో సడెన్ గా ఓ మహిళ, ఆమె కుటుంబసభ్యులంతా శుభాకార్యం జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. రావడం రావడమే.. పెళ్లి మండపం వద్దకు వెళ్లి..  పెళ్లి కొడుకుని చితకబాదడం మొదలుపెట్టారు. వరుడిని కొట్టేది మరెవరో కాదు.. అతని మొదటి భార్య కాగా... ఇప్పుడు జరిగేది అతనికి మూడో వివాహం. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరాచీలోని నార్త్ నజీమాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పెళ్లి కుదిరింది. బంధువులను అంతా ఆహ్వానించి పెళ్లి చేసుకుంటుండగా... ఓ మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వరుడిని చితకబాదారు. ఎందుకు కొడుతున్నారని ఆరా తీస్తే.. ఆమె అతని మొదటి భార్య అని తేలింది.

Also Read బీచ్ లో బికినీ వేసిన మహిళ.. లాక్కెళ్లిన పోలీసులు, వీడియో వైరల్...

తనకు తెలీకుండా భర్త ఇప్పుడు మూడో వివాహం చేసుకుంటున్నాడని... ఈ పెళ్లి జరగడానికి వీలు లేదని ఆమె ఆరోపించింది. అయితే.. సదరు వరుడి వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఆమె తన మొదటి భార్య అని అంగీకరించిన అతను... ఆమెతో విడిపోయినట్లు చెబుతున్నాడు. తన మొదటి భార్యతో కొంతకాలం క్రితమే విడిపోయానని చెప్పాడు. ఇప్పటికే ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపానని.. ఈ విషయం గురించి తన లాయర్ మాట్లాడతాడని చెప్పడం విశేషం. 

కాగా... తనను దారుణంగా కొట్టిన మొదటి భార్య, ఆమె కుటుంబసభ్యులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం విశేషం. అయితే... ఈ విషయాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవడం మేలని పోలీసులు సూచించారు. తీవ్రంగా గాయపడిన వరుడిని మాత్రం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సదరు మహిళ మాత్రం తనకు తెలీకుండా 2018లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడేమో మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని మండిపడుతోంది. అతను మాత్రం తనకు ఇదే రెండో పెళ్లి అని చెబుతుండటం విశేషం. 1961 ముస్లిం ఫ్యామిలీ చట్టం ప్రకారం.. రెండో పెళ్లికి సిద్ధపడిన వ్యక్తి మొదటి భార్య నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


 

click me!