ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం కొనిచ్చారు.. వారికి ఎదురైన సంఘటనతో షాక్... వైరల్ అవుతున్న వీడియో..

By SumaBala BukkaFirst Published Dec 30, 2021, 9:58 AM IST
Highlights

హృదయాన్ని ఆర్ధ్రం చేసే ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు కొల్లగొడుతోంది. ఓ తెలియని వ్యక్తి.. తనకసలేం సంబంధం లేని వ్యక్తికి సాయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ప్రతిగా అతను చేసిన సాయం మనల్ని మరింత ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఒక్కసారిగా సంతోషం, భావోద్వేగం ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

నేటి రోజుల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారం.. వీడియోలతో సహా అరచేతుల్లో అమరిపోతోంది. వీటిల్లో క్యూట్ క్యూట్ పప్పీస్ వీడియోలు, చిన్నారుల ముద్దు ముద్దు మాటలు, డ్యాన్సులు, కుకరీ.. వాట్ నాట్..ఎన్నో రకాల వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. చూస్తుంటే చూడబుద్దేసేలా ఉంటూ.. మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. వైరల్ గా మారుతున్నాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హృదయాన్ని ఆర్ధ్రం చేసే ఈ video ఇప్పుడు Netizens మనసు కొల్లగొడుతోంది. ఓ తెలియని వ్యక్తి.. తనకసలేం సంబంధం లేని వ్యక్తికి సాయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ప్రతిగా అతను చేసిన సాయం మనల్ని మరింత ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఒక్కసారిగా సంతోషం, భావోద్వేగం ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

దారుణం.. దళిత బాలికను బంధించి, కాళ్లపై కొడుతూ.. థార్డ్ డిగ్రీ లెవల్లో టార్చర్..

విషయానికి వస్తే.. ఈ వీడియోలో.. ఓ Shopping Mallలో షాపింగ్ చేస్తున్న కుటుంబాన్ని ఓ వ్యక్తి తన పర్స్ ఇంట్లో మరిచిపోయానని.. తనకు lunch కొనిపెడతారా? అని దీనంగా అడుగుతాడు. దీనికి వాళ్లు అయ్యో.. అదెంత పని సరే అంటూ 20 డాలర్లు పెట్టి అతనికి భోజనం కొనిస్తారు. అది పెద్ద విషయం కాదు... కానీ వారి ఆర్థిక పరిస్థితి రీత్యా అది పెద్ద విషయమే.. వారి కూతురు Cerebral palsy తో బాధపడుతోంది. ఆమె వైద్యానికి వారికి చాలా ఖర్చవుతోంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి అది తలకు మించిన భారమే. అయినా తోటివారి ఆకలి తీర్చడానికి వారు ముందుకు వచ్చారు. 

ఆ వ్యక్తికి 20 డాలర్లతో లంచ్ కొనిపెట్టారు. ప్రతిగా ఆ వ్యక్తి వారి కుటుంబానికి క్రిస్మస్ కానుకగా 500 డాలర్లు ఇవ్వడంతో వారు ఆనందంతో భావోద్వేగానికి గురవుతారు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పాప తండ్రి అయితే ఈ అనుకోని ఘటనకు కన్నీరు పెట్టుకుంటాడు. తన కూతురు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతోందని.. ఆమె ఎప్పుడూ షాపింగ్ కు రాలేదని.. అది కూడా ఆమెకు తెలియాని తీసుకువచ్చామని.. చెప్పుకొచ్చారు ఆ తల్లిదండ్రులు.

Omicron: ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా విలవిల.. ఒక్కరోజే 5 లక్ష‌ల కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

ఈ వీడియో అప్‌లోడ్ చేయబడినప్పటి నుండి, 5.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 425k లైక్‌లు, వేలకొద్దీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది స్పందిస్తూ ’దాతృత్వానికి పేదా, గొప్ప బేధం లేదు. తాము కష్టాల్లో ఉన్నా ఓ వ్యక్తి ఆకలితో అలమటించడాన్ని వారు చూడలేకపోయారు. బహుశా ఆకలి వారికి బాగా తెలిసిన నేస్తం కావడం వల్లేనేమో.. అందుకే వారు వెనుకాడలేదు’ అంటూ స్పందించారు. మరొకరు స్పందిస్తూ.. "ఇది చాలా అద్భుతంగా ఉంది.  తమ దగ్గరున్న కాస్తనే నలుగురితో పంచుకోవడానికి వీరు ముందుకు రావడం అద్భుతం. ఇది నన్ను ఏడిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. చాలామంది ఈ కుటుంబానికి తమ శుభాకాంక్షలు అందజేశారు. దేవుడి ఆశీస్సులు వీరికి దండిగా ఉండాలంటూ కోరుకున్నారు. 

 

click me!