‘అమ్మో అదో భయంకర అనుభవం.. ఆ భయంతోనే ఆటోలో నుంచి దూకేశాను..’ ఓ మహిళ ట్విటర్ పోస్ట్ వైరల్

By SumaBala Bukka  |  First Published Dec 22, 2021, 12:07 PM IST

హర్యానాలోని గుర్గావ్‌లోని ఓ మహిళ ఢిల్లీ సమీపంలోని ఓ నగరంలో తనను ఆటోరిక్షా డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు వివరిస్తూ ట్విట్టర్‌లో సుదీర్ఘమైన కథనాన్ని పోస్ట్ చేసింది. దాన్నుంచి తప్పించుకుని కదులుతున్న వాహనంలోంచి దూకాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాదు, ఈ సంఘటన ఆమె ఇంటికి కేవలం ఏడు నిమిషాల దూరంలో ఉన్న.. గుర్గావ్ సెక్టార్ 22 వద్ద జరిగిందని మహిళ ట్వీట్ చేసింది.


గుర్గావ్ : Haryanaలో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన ఓ మహిళకు భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. దీనికి సంబంధించిన ఆమె తన అనుభవాన్ని twitter లో పోస్ట్ చేయడం వల్ల ఈ horror సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే.. 

హర్యానాలోని గుర్గావ్‌లోని ఓ మహిళ ఢిల్లీ సమీపంలోని ఓ నగరంలో తనను ఆటోరిక్షా డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్లు వివరిస్తూ ట్విట్టర్‌లో సుదీర్ఘమైన కథనాన్ని పోస్ట్ చేసింది. దాన్నుంచి తప్పించుకుని కదులుతున్న వాహనంలోంచి దూకాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాదు, ఈ సంఘటన ఆమె ఇంటికి కేవలం ఏడు నిమిషాల దూరంలో ఉన్న.. గుర్గావ్ సెక్టార్ 22 వద్ద జరిగిందని మహిళ ట్వీట్ చేసింది.

Latest Videos

undefined

ఆ మహిళ పేరు నిష్ఠా, ఆమె ట్విట్టర్ ప్రొఫైల్ ప్రకారం ఆమె Communications Specialist గా పనిచేస్తుంది. తనకు జరిగిన అనుభవం గురించి చెబుతూ తాను ఎక్కిన ఆటోరిక్షా డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా Wrong turn తీసుకున్నాడని, తెలియని రహదారి వైపు ఆటోను మళ్లించాడు.. తను అభ్యంతరం చెబుతున్నా.. అలాగే డ్రైవ్ చేయడం కొనసాగించాడని ఆరోపించింది. దీనిమీద ఆమె నిరసన వ్యక్తం చేసింది కానీ అతను స్పందించలేదు.

"అప్పటికి నాకు అర్థం అయ్యింది. నేను దాదాపుగా Kidnapped అవుతున్నానని.. అలాగే నేను భావిస్తున్నాను. నిన్న నా జీవితంలో అత్యంత భయానకమైన రోజులలో ఒకటి. అది ఏమిటో నాకు తెలియదు, ఇది ఇప్పటికీ నాకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు, నేను  మా ఇంటికి 7 నిమిషాల దూరంలోని బిజీ మార్కెట్ సెక్షన్ 22 (గుర్గావ్) ఆటో స్టాండ్ కు వెళ్లి.. ఆటో ఎక్కాను." అని నిష్ఠ ట్వీట్ చేసింది.

“నా దగ్గర క్యాష్ లేదు కాబట్టి పేటీఎం చేస్తానని ఆటో డ్రైవర్‌కి చెప్పాను. దానికి అతను ఒప్పుకున్నాడు. అతను ఉబర్ డ్రైవర్ గా చేయడానికి సరిపోయాడని అతని సెటప్‌ని చూసి, అతను దానికి సూట్ అవుతాడని అనుకున్నాను. నా అభ్యర్థనకు అతను అంగీకరించి నేను ఆటోలో కూర్చున్నాను. అంతేకాదు ఆటోలో మంచి భక్తి సంగీతాన్ని చాలా మంద్రమైన స్థాయిలో వింటున్నాడు" అని ఆమె చెప్పింది.

దేవతలు చలికి ఒణుకుతున్నారంటూ... విగ్రహాలకు శాలువాలు కప్పుతున్న పూజారి..

"నేను నివసించే సెక్టార్‌కు కుడివైపునకు వెళ్లాల్సిన టి పాయింట్‌కి మేము చేరుకున్నాం. కానీ అతను ఎడమవైపుకు తీసుకున్నాడు. మీరు ఎడమవైపుకు వెళ్తున్నారా అని నేను అతనిని అడిగాను. అతను జవాబివ్వలేదు, బదులుగా అతను ఓ దేవుని పేరుతో అరవడం ప్రారంభించాడు. ఆ దేవుడి పేరేంటో నేను చెప్పను.. కారణం అది ఏ మతానికి సంబంధించినది కాదు కాబట్టి ఇక్కడ మతాన్ని పేర్కొనాలనుకుంటున్నాను" అని నిష్ఠ ట్వీట్ చేశారు.

"నేను అక్షరాలా అరిచాను - 'భయ్యా, మేరా సెక్టార్ రైట్ మే థా ఆప్ లెఫ్ట్ మీ క్యు లేకే జా రహే హో.' (నా సెక్టార్ కుడివైపు ఉంది.. మీరు ఎడమవైపు ఎందుకు తీసుకెడుతున్నారు)అని అడిగాను. అతను ప్రతిస్పందించలేదు. అంతేకాదు  హై పిచ్‌లో దేవుని పేరు చెబుతూనే ఉన్నాడు. నేను అతని ఎడమ భుజంపై 8-10 సార్లు తట్టాను, కానీ ఏ మాత్రం స్పందన లేదు. దీంతో నాకేదో కీడు శంకించింది. నా మనసు ఆటోలో నుంచి బైటికి దూకేయమని చెప్పింది.. అని ఆమె రాసుకొచ్చారు. 

‘అప్పటికే ఆటో స్పీడ్ 35-40 మధ్య ఉంది. ఇంకా అతను స్పీడ్ పెంచేలోపు.. దూకడం ఒక్కటే ఆప్షన్. కిడ్నాప్ అవ్వడం కంటే కాలో, చేయో విరిగి పోవడం మంచిది అనిపించింది. అంతే కదులుతున్న ఆటోలోంచి ఒక్కసారిగా దూకేశాను. ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలీదు." అని ఆమె ట్వీట్ చేసింది.

ఇది ట్విటర్ లో వైరల్ కావడంతో ఈ ఘటన మీద ఆటోరిక్షా డ్రైవర్‌ను కనిపెట్టి దర్యాప్తు చేస్తామని గుర్గావ్‌లోని పాలం విహార్‌కు చెందిన జితేందర్ యాదవ్ అనే పోలీసు అధికారి తెలిపారు. అయితే భయం వల్ల తాను ఆటోరిక్షా నంబర్‌ను నోట్ చేసుకోలేకపోయానని నిష్ఠ చెప్పింది. డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే అవకాశం ఉంది.

click me!