ఓఎల్‌ఎక్స్‌లో బైకు చూసి మురిసిపోయి...మోసపోయాను...

By Sandra Ashok KumarFirst Published Feb 3, 2020, 4:37 PM IST
Highlights

సాధారణంగా ఏదైనా కొనలంటే ముందుగా మన ఫోన్ ఉపయోగించి ఆన్ లైన లో వస్తువులను బట్టలను కొంటుంటం. దీనిని కొందరు అదునుగా చేసుకొని జనాలని మోసం చేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏదైనా ఆన్ లైన ద్వారా అరచేతిలోనే అన్నీ కొనేయొచ్చు, అలాగే వస్తువులను, వాహనాలు కూడా క్షణంలోనే అమ్మేయొచ్చు. దీనిని కొందరు అదునుగా చేసుకొని జనాలని మోసం చేస్తున్నారు. ఎలాంటి సంఘటన ఇటివల ఒక వ్యక్తికి  ఎదురైంది. సాధారణంగా ఏదైనా కొనలంటే ముందుగా మన ఫోన్ ఉపయోగించి ఆన్ లైన లో వస్తువులను బట్టలను కొంటుంటం. 

also read కరోనా వైరస్ ఎఫెక్ట్...ఆ బీర్ ముట్టని జనాలు... సేల్స్ ఢమాల్

అలాగే అదే విధంగా ఏదైనా వస్తువులను అమ్మేయలన్న ఆన్ లైనలో అమ్మేసుకోవచ్చు. తాడేపల్లిరూరల్‌ పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌ యాప్‌ను  నమ్ముకొని మోసపోయానని గ్రహించి చివరకు ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్రవాహనం అమ్మకానికి  ఉందని చూసి దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. 

ఓఎల్‌ఎక్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్‌ నెంబర్‌ 8168232398 ఉండటంతో ఆ వ్యక్తికి ఫోన్‌ చేశాడు. సదురు అమ్మకందారుడు తాను విశాఖపట్నంలో  ఆర్మీలో పనిచేస్తానని  చెప్పాడు.   తనకు ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు ట్రాన్సఫర్ అయిందని, అందుకే రూ.2 లక్షల విలువగల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మించాడు.

మొదట గూగుల్‌పే ద్వారా తనకు రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి తన వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత  మాట మార్చి ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో ఆ వ్యక్తికి చెల్లించాడు.

also read 43 ఏళ్ల బ్యూటీ బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో సెగలు!

ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్‌ఎక్స్‌లో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎటువంటి స్పందన కూడా లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్‌ విభాగానికి కేసును అప్పగించారు.

click me!