కరోనా రోగుల శాడిజం... మిగితా వాళ్లకి కూడా వైరస్ సోకాలని..

By telugu team  |  First Published Jan 30, 2020, 2:01 PM IST

ఆ వ్యాధి సోకిన బాధితులకూ ఇతరులకూ అంటిస్తున్నారు. ఫలితంగా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చైనాలోని కరోనా వ్యాపించిన రోగులు తమలోని శాడిజాన్ని బయటకు తీస్తున్నారు.  ఈ వ్యాధిబారిన పడిన కొంతమంది బాధితులు ప్రజల్లో కలిసిపోతున్నారు. వారిపై ఉమ్ములు వేస్తూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు.


కరోనా వైరస్ పేరు చెబితే జనాలు వణికిపోతున్నారు. కేవలం జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వచ్చే ఈ జబ్బు వెంటనే ప్రాణాలను హరిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో మొదట వృద్ధి చెందిన  ఈ కరోనా వైరస్ ఇప్పుడు దేశ విదేశాలకు పాకుతోంది. ఇప్పటికే 180మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ అత్యంత వేగంగా ప్రభలుతోంది. గబ్బిలాలు, ఎలుకలు తదితర జంతువుల వల్ల ఈ వ్యాధి ప్రభలే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. తొలుత వీటి నుంచి వ్యాపించినా ప్రస్తుతం ఒక మనిషి నుంచి మరో మనిషికి కూడా వ్యాపిస్తోంది. దీంతో... ఈ వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు.  నేపథ్యంలో ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. 

Latest Videos

undefined

అయితే, ఆ వ్యాధి సోకిన బాధితులకూ ఇతరులకూ అంటిస్తున్నారు. ఫలితంగా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చైనాలోని కరోనా వ్యాపించిన రోగులు తమలోని శాడిజాన్ని బయటకు తీస్తున్నారు.  ఈ వ్యాధిబారిన పడిన కొంతమంది బాధితులు ప్రజల్లో కలిసిపోతున్నారు. వారిపై ఉమ్ములు వేస్తూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు.

Also Read కరోనా వైరస్ ఎఫెక్ట్...ఆ బీర్ ముట్టని జనాలు... సేల్స్ ఢమాల్.

చైనాలోని ఓ హాస్పిటల్‌లో కరోనా వ్యాధి చికిత్సకు వచ్చిన ఓ బాధితుడు.. రిసెప్షన్‌లో బిల్లు చెల్లిస్తూ అక్కడ ఉన్న సిబ్బందిపై ఉమ్ములు వేశాడు. ఈ ఘటన హాస్పిటల్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. ఇలా చాలా మంది చేస్తున్నట్లు సమాచారం.

దీంతో ఎవరికి వైరస్ ఉందో.. ఎవరికి లేదో కూడా తెలీక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా బయపడి చస్తున్నారు. తల నుంచి కింద వరకు పూర్తి మాస్కులతో తిరుగుతున్నామని పలువురు వాపోతుండటం గమనార్హం. 

click me!