పెళ్లిలో వధువు అదిరిపోయే స్టెప్పులు.. వరుడి సంగతేమోకానీ, నెటిజన్లు ఫిదా

By telugu team  |  First Published Feb 5, 2020, 1:08 PM IST

కాబోయే భర్తను సర్ ప్రైజ్ చేద్దామని  అంజలి  ఇలా పెళ్లి మంటపంలో డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె డాన్స్ చూసిన అతిథులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతే కాదు కళ్యాణ మండపం అంతా అతిథుల నవ్వులు విరిశాయి.  వారు కూడా చప్పట్లతో వధువు, అమ్మాయిల నృత్యానికి వంత పాడారు.


పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది వధూవరులే. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు  హడావిడి చేస్తుంటే... వధూవరులు మాత్రం వేదికగా సిగ్గుపడుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోతారు. ఎప్పుడన్నా.. వరుడు బంధువులు, స్నేహితుల బలవంతం మీద స్టెప్పులు వేసేవారు.  

అయితే.. ఇప్పుడు అమ్మాయిల టైం వచ్చింది. అమ్మాయిలు సిగ్గుపడుతూ కూర్చునే రోజులు పోయాయని చెబుతున్నారు. ఇందుకు ఈ సంఘటనే నిదర్శనం. కేరళలో ఓ యువతి తన పెళ్లిలో తానే స్టెప్పులేసింది. ఆమె స్టెప్పులకు వరుడు ఖుష్ అయ్యాడో లేదో తెలీదు కానీ.. నెటిజన్లు మాత్రం ఫిదా అయిపోయారు. 

Latest Videos

undefined

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలో ఓ వధువు..  పెళ్లిమండపంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పెళ్లిలోనే డాన్స్ చేసి.. అతిధులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.  సంప్రదాయ దుస్తుల్లో కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టిన నవ వధువు..  ఇంకా పెళ్లి మంటపానికి చేరుకోకుండానే డాన్స్ మొదలు  పెట్టింది. ఆమె వెనుక ఉన్న తోటి అమ్మాయిలు కూడా అందరూ నృత్యం చేయడం విశేషం. 

Also Read విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించిన టీచర్... పేరెంట్స్ కి తెలియడంతో.

ఈ పెళ్లి కేరళలోని కన్నూరులో జరిగినట్లు తెలుస్తోంది. కాబోయే భర్తను సర్ ప్రైజ్ చేద్దామని  అంజలి  ఇలా పెళ్లి మంటపంలో డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె డాన్స్ చూసిన అతిథులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతే కాదు కళ్యాణ మండపం అంతా అతిథుల నవ్వులు విరిశాయి.  వారు కూడా చప్పట్లతో వధువు, అమ్మాయిల నృత్యానికి వంత పాడారు.

అంజలి సర్ ప్రైజ్ డ్యాన్స్ కి ఆమె కాబోయే భర్త ఎంతలా ఇంప్రెస్ అయ్యాడో తెలీదు కానీ... నెటిజన్లు మాత్రం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వేలాది మంది ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ట్విట్టర్ లో 50వేలకు పైగా ఈ వీడియోని రీట్వీట్ చేశారు. 

When brides change the trend .. https://t.co/9XkqVDOBMk

— PM (@SoULinStillNESS)

 

click me!