Food Trend: సూప్ నూడిల్స్ లో ఐస్ క్రీమ్..!

Published : Mar 26, 2022, 05:13 PM ISTUpdated : Mar 26, 2022, 05:14 PM IST
Food Trend:  సూప్ నూడిల్స్ లో ఐస్ క్రీమ్..!

సారాంశం

ఈ మధ్యకాలంలో కొన్ని వెరైటీ వంటకాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని పాజిటివ్ గా బాగా క్లిక్ అయితే... కొన్ని విమర్శలకు గురౌతూ ఉంటాయి.   

భారతదేశం భిన్నమైన ఏకత్వం కలిగిన దేశం.  విభిన్న భాషలు, సంస్కృతులు కలిసిన దేశం మనది. కేవలం భాష, సంస్కృతి మాత్రమే కాదు.. ఆహారం లోనూ చాలా సంప్రదాయాలు ఉన్నాయి.  ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఆహార ప్రియులు. అందుకే రకరకాల ఫుడ్స్ తినడానికి వెరైటీగా ఇష్టపడతారు. 

 రకరకాల వెరైటీలను ఇప్పటి వరకు మనం రుచి చూసి ఉండొచ్చు. కాగా.. ఈ మధ్యకాలంలో కొన్ని వెరైటీ వంటకాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని పాజిటివ్ గా బాగా క్లిక్ అయితే... కొన్ని విమర్శలకు గురౌతూ ఉంటాయి. 

 

ఫుడ్ ట్రెండ్‌లలో మ్యాగీ మిల్క్‌షేక్, ఫుడ్ మసాలా దోస ఐస్ క్రీమ్ రోల్, మోమోస్ ఐస్ క్రీమ్ రోల్ మొదలైనవి ఉన్నాయి. ఫ్రూటీ చాయ్ రిసిపి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యింది. ఈ కాంబినేషన్ ని అందరూ తిట్టుకున్నారు. కాగా.. తాజాగా ఓ వ్యక్తి.. ఐస్ క్రీమ్ మిక్స్ నూడిల్స్ చేయడం గమనార్హం. ఓ జపనీస్ రెస్టారెంట్ ఈ వింత వంటకాన్ని కనిపెట్టడం గమనార్హం.

 జపనీస్ రెస్టారెంట్ ఈ ఐస్‌క్రీమ్ సూప్‌ను తయారు చేసింది. కట్ చేసిన ఐస్‌క్రీమ్‌ను నూడుల్స్ కి సూప్‌కి జోడించడం మనం కింద వీడియోలో చూడొచ్చు. ఆ వింత వంటకాన్ని వినియోగదారులు దానిని ఆస్వాదించడం గమనార్హం.. 

ఈ వీడియోను 3.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ విచిత్రమైన ఆహారాన్ని కొందరు మెచ్చుకుంటే, మరికొందరు దీన్ని చెడు ఆహారంగా విమర్శిస్తున్నారు. నేను తప్పకుండా ట్రై చేస్తానని కొందరంటే, మరికొందరు నాకు ఐస్‌క్రీమ్‌పై ఆసక్తి తగ్గిందని కామెంట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Viran News : గొడవ పడటమే ఇతడి బిజినెస్.. ఒక్క గొడవతో ఎంత సంపాదిస్తాడో తెలుసా?
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !