మా నాన్నను రూ.2 లక్షలకు అమ్మేస్తా.. కావాలంటే కాలింగ్ బెల్ కొట్టండి.. తండ్రిని అమ్మకానికి పెట్టిన చిన్నారి..

By SumaBala Bukka  |  First Published Oct 10, 2023, 10:22 AM IST

తండ్రి మందలించాడని ఓ చిన్నారి అతడిని ఏకంగా అమ్మకానికి పెట్టింది. రూ. 2 లక్షలు ఉంటే కాలింగ్ బెల్ మోగించాలంటూ ఓ నోట్ రాసి మెయిన్ గేట్ కు అతికించింది. 


తల్లిదండ్రులు చిన్నారులను మందలించడం మామూలే. దీనికి చిన్నారులు రకరకాలుగా స్పందిస్తుంటారు. కొంతమంది చిన్నారులు అలిగి తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. మరికొంతమంది ముఖం మాడ్చుకుని కూర్చుని కోప్పడిన తల్లిదండ్రులకే జాలి కలిగేలా ప్రవర్తిస్తారు. ఇంకొంతమంది ఏడుపుతో తమ నిరసనను వ్యక్తం చేస్తారు.  కానీ ఓ చిన్నారి మాత్రం వీటన్నింటికంటే భిన్నంగా స్పందించింది. 

ఏకంగా తన తండ్రి తనను మందలించాడని.. తనకు కోపం వచ్చిందని.. నాన్నను అమ్మేస్తానంటూ  ఇంత గేటుకి ఓ నోట్ తగిలించింది. ఇది కాస్త ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఓ 8 ఏళ్ల చిన్నారికి తండ్రి మీద కోపం వచ్చింది. రెండు లక్షల రూపాయలకు తండ్రిని అమ్మేస్తానంటూ ఇంటికి ఓ ప్రకటన తగిలించింది. @Malavtweets ట్విట్టర్ హ్యాండిల్ ఈ పోస్ట్ ను షేర్ చేసింది.  

Latest Videos

undefined

మహిళ గొంతులో ఇరుక్కుపోయిన టూత్ బ్రష్.. భర్త మొహంపై కొట్టడంతో...

ఈ నోట్ లో.. ‘ మా నాన్నను రెండు లక్షల రూపాయలకు అమ్మేస్తాను.  డీటెయిల్స్ కావాలంటే కాలింగ్ బెల్ కొట్టండి’  అని రాసి ఉంది. ఇంటి మెయిన్ డోర్ కు… ఫాదర్ ఫర్ సేల్  అనే నోట్ అతికించింది. దీన్ని చూసిన తండ్రి  కూతురికి తన మీద వచ్చిన కోపానికి నవ్వాపుకోలేకపోయాడు. ఆ నోట్ ను  ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు, తన ఎనిమిదేళ్ల కూతురికి చిన్న గొడవ జరిగిందని..  తాను ఆమెను మందలించానని.. దీంతో కోపానికి వచ్చిన కూతురు తనను అమ్మకానికి పెట్టిందని.. ఆ పోస్టులో చెప్పుకొచ్చాడు.  

దీంతో ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు వైరల్ గా మారడంతో నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.  ఇప్పటికే ఈ పోస్టును 31 వేలమంది చూశారు. ‘చిన్నపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.. అదే సమయంలో కొన్ని విషయాల్లో కఠినంగానూ ఉంటారు’.. అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘ఆశ్చర్యంగా ఉంది ఆ పాపకి అలాంటి ఐడియా ఎలా వచ్చింది’ అంటూ మరొకరు ఆశ్చర్యపోయారు.

‘ఓపికతో ఉండండి… మీరు చాలా గొప్ప తండ్రి’ అంటూ ఒకరు స్పందించారు.. ‘మీ పాపకు చాలా కోపం వచ్చినట్టుంది’ అంటూ ఇంకొకరు స్పందించారు… ఇలా కామెంట్లు ఈ పోస్ట్ పై వెళ్లువెత్తుతున్నాయి.


 

A minor disagreement and 8-year-old decided to put up a Father For Sale notice out of our apartment door.

Methinks I am not valued enough. 😞 pic.twitter.com/Epavc6gBis

— Melanchoholic (@Malavtweets)
click me!