కుక్కకు శ్రీమంతం చేసిన ఫ్యామిలీ.. వైరల్ వీడియో..!

By telugu news teamFirst Published Oct 2, 2023, 9:48 AM IST
Highlights

కుక్కకు బొట్టు పెట్టి, గాజులు తొడిగారు. పూలు దానిపై చల్లి, స్వీట్లు తినిపించారు.  దానికి పట్టు చీర కూడా చుట్టారు. అలాగే దాని ముందు, ఐయామ్ రెడీ అనే బోర్డ్ కూడా పెట్టడం విశేషం. 
 


కుక్కలను పెంచుకునేవారు మనలో చాలా మంది ఉన్నారు. చాలా మంది పెంపుడు కుక్కలను తమ పిల్లల్లా చూసుకుంటారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు కూడా ఉంటారు. వాటికి ఏదైనా జరిగితే తమ ప్రాణం పోయినట్లుగా బాధపడుతూ ఉంటాం. కాగా, తాజాగా ఓ కుటుంబం అయితే, తమ పెంపుడు కుక్కకు ఏకంగా శ్రీమంతం చేశారు. ఇంట్లో కడుపుతో ఉన్న ఆడవారికి శ్రీమంతం చేయడం అందరికీ తెలిసిందే. అయితే, కడుపుతో ఉన్న కుక్కకు శ్రీమంతం చేయడం చేయడం విశేషం. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా గోల్డెన్ రిట్రీవర్ డాగ్ కు వారి యజమానులు సీమంతం చేశారు. తమ పెంపుడు కుక్క రోజీ గర్భం దాల్చి డెలివరీకి  సమయం దగ్గరపడింది. దీంతో, యజమానులైన సిద్ధార్థ్ శివమ్ కుటుంబం ఘనంగా సీమంతం చేసింది. కుక్కకు బొట్టు పెట్టి, గాజులు తొడిగారు. పూలు దానిపై చల్లి, స్వీట్లు తినిపించారు.  దానికి పట్టు చీర కూడా చుట్టారు. అలాగే దాని ముందు, ఐయామ్ రెడీ అనే బోర్డ్ కూడా పెట్టడం విశేషం. 

 

ఈ  వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది.  ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అదేవిధంగా 1.7లక్షల లైకులు వచ్చాయి. ఇక, నెటిజన్లు యజమానులు చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. కుక్కు సీమంతం చేయడం చాలా గొప్ప నిర్ణయం అని కొందరు కామెంట్స్ చేశారు. సో క్యూట్ అని కొందరు, కొందరు ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

click me!