నిజంగానే.. ఆ పబ్ లో దెయ్యాలున్నాయి..!

By Ramya news teamFirst Published Jan 21, 2022, 9:33 AM IST
Highlights

అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. పబ్‌లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులన్నీ వాటంతట అవే కదలడం లాంటి సంఘటనలు జరగడం మొదలయ్యాయి.

దెయ్యాలు ఉన్నాయని కొందరు బాగా నమ్ముతారు. కొందరేమో.. అసలు వాటిని నమ్మరు. ఆత్మలు, దెయ్యాలు అంటూ ఏమీ ఉండవని.. అందంతా మన భ్రమ అని కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే.. యూకేలోని ఓ పబ్ లో మాత్రం నిజంగానే దెయ్యాలు ఉన్నాయట.  అవి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూకేకి చెందిన రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్‌బిట్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు డార్లింగ్‌టన్‌లోని మార్పెత్‌లో బ్లాక్ అండ్ గ్రే పబ్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత నంచి వారే ఆ పబ్‌ని నడపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. పబ్‌లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులన్నీ వాటంతట అవే కదలడం లాంటి సంఘటనలు జరగడం మొదలయ్యాయి.

మొదట వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అక్కడ  పనిచేసే సిబ్బంది మాత్రం భయపడటం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ అక్కాచెల్లళ్లు పబ్‌లోని మెట్లమీద నుంచి నడుస్తుంటే ఏవో వింత శబ్దం వచ్చిందని, పైగా సెల్లార్‌కి వెళ్లాలన్న భయంగా ఉందని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.  

 

 

ఈ మేరకు పోలీసులు ఆ పబ్‌ని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ అక్కా చెల్లెళ్లు పోలీసుల ముందే దెయ్యాలు ఉన్నాయని చూపించేందుకు ఒక సాహసం చేశారు. ఈ క్రమంలో వాళ్లు ఒక పెన్‌ని చేతిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైన ఉంటే ఈ పెన్నుని కదిలించండి అన్నారు. అంతే కాసేపటికి నిజంగానే ఆ పెన్ను దానంతటే అదే కదిలింది. దీంతో భయంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఆ పబ్‌లోని సీసీఫుటేజ్‌ని పరిశీలించి చూస్తే ...నిజంగానే ఏవో వింత ఆకారాలు, మనిషి నీడలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు. అంతేకాదు ఈ సీసీఫుటేజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

click me!