సోషల్ మీడియాలో ఇప్పుడో పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. దీనిమీద నెటిజన్లు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే..
నేటి రోజుల్లో పెళ్లి అంటే పెద్ద సెటప్ లు.. ప్రీ వెడ్డింగ్ షూట్ లతో మొదలు పెట్టి.. సంగీత్..హల్దీ...పెళ్లి, రిసెప్షన్.. అన్నీ భారీగా చేయడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు అందులో తమ హోదాకు తగ్గట్టుగా వెరైటీ చూపించాలనుకుంటున్నారు. దీనికోసం ఎంత డబ్బునైనా ఖర్చుచేయడానికి వెనకాడడం లేదు. అందుకే పెళ్లి అనేది ఓ పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
పెళ్లిలో వధువు ఎంట్రీ ఇదివరకటి రోజుల్లో అయితే.. చేతిలో కొబ్బరి బోండాంతో తలదించుకుని మెల్లిగా నడిచిరావడమో.. మేనమామలు గంపలో ఎత్తుకు రావడమో చేసేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. కొందరు వధువులు హాయిగా డ్యాన్సులు చేస్తూ ఎంట్రీ ఇస్తుంటే.. మరికొందరు.. గుర్రపుబగ్గీల్లో.. పల్లకీల్లో వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు.
undefined
కానీ ఇప్పుడు ఓ వివాహావేడుకలో వధువుకు సంబంధించిన ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి..నెటిజన్లనుంచి విభిన్న కామెంట్లను పొందుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వధువు, తన తండ్రితో కలిసి వివాహ వేదిక దగ్గరికి వచ్చింది. మామూలే కదా అనుకుంటున్నారా? అది.. పైన వేలాడుతున్న షాండ్లియర్ లో కదులుతూ వచ్చింది.
ఆశ్చర్యపోకండి ఇది నిజంగా జరిగింది. కదులుతున్న భారీ షాండ్లియర్ లో కూతురుతో పాటు తండ్రి రావడం.. దాన్ని కిందున్న వాళ్లంతా సంతోషంగా ఫొటోలు, వీడియోలు తీయడం వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన వారు.. మరీ ఇంత ‘షో ఆఫ్ పనికిరాదు’.. ‘డబ్బులు ఎక్కువుంటే ఇంతగా ప్రదర్శించాలా?’...అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఒకవేళ ఏదైనా జరిగి షాండ్లియర్ తెగితే.. వారి పరిస్థితి ఏంటి? అని మరో నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంకొకరేమో..‘ఎందుకైనా మంచిది వారికి పారాచూట్ లు ఇవ్వండి’ అంటూ కామెంటాడు. ీ పిచ్చి పీక్స్ కు చేరుతున్నట్టుంది.. మరోసారి మరొకరు.. మిషన్ ఇంపాజిబుల్ చిత్రం నుండి ఎంట్రీ సీన్ చూడాల్సి ఉంటుందేమో.. అని మరొక నెటిజన్ స్పందించాడు.
Please don't let this become a thing pic.twitter.com/rWRGsyENFp
— Fasi Zaka (@fasi_zaka)