వైరల్.. పక్షి చేసిన పని.. రైల్వే ట్రాక్స్ పై విరుచుకుపడిపోయిన టీసీ..

By SumaBala BukkaFirst Published Dec 9, 2022, 11:30 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ప్లాట్‌ఫారమ్‌పై నున్న హైటెన్షన్ వైరు తెగిపడి టికెట్ కలెక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ఖరగ్‌పూర్ : ప్రమాదం ఏ సమయంలో ఎటు నుంచి.. ఎలా పొంచి ఉందో చెప్పలేం. మృత్యువుకు భయపడి ఒంటిస్తంభం మేడలో దాక్కున్నా పరీక్షిత్తు మహారాజు బతకలేకపోయాడు. ఇక సామాన్యుల గురించి చెప్పనక్కరలేదు. అలాంటి ఓ విచిత్రమైన ఘటన పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంది. ఓ చిన్న పక్షి చేసిన పని రైల్వే టికెట్ కలెక్టర్ ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. 

గూడు కట్టుకోవడానికి పుల్లలు తీసుకువెడుతుంటే ఓ పుల్ల రైల్వే స్టేషన్ లో ఉన్న హై టెన్షన్ వైరు మీద పడింది. దీంతో వైరు తెగి.. ఫ్లాట్ ఫాం మీద నిలబడ్డ టీటీమీద పడింది. అంతే ఉన్నచోటే బిగిసుకుపోయి అలాగే వెనక్కి విరుచుకుపడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌ మీద జరిగింది.  ఆ టికెట్ కలెక్టర్‌ను సుజన్ సింగ్ సర్దార్‌గా గుర్తించారు.

రైలు పట్టాలపై కూర్చుని ప్రేమ కబుర్లు.. ట్రైన్ ఢీ కొట్టడంతో ప్రేమ జంట మృతి..

ఈ ప్రమాదంలో అతనికి కాలిన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌లో ఇద్దరు టిక్కెట్ కలెక్టర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. హఠాత్తుగా ప్లాట్‌ఫారమ్‌పైనున్న వైర్ తెగి టికెట్ కలెక్టర్ తలపై పడింది. 

దీంతో అతను నిలబడ్డవాడు నిలబడ్డట్టుగానే అలాగే వెనక్కి.. ఫ్లాట్ ఫాం మీదినుంచి ట్రాక్స్ మీదికి పడిపోయాడు. అప్పటివరకు అతనితో మాట్లాడుతున్న మరో అధికారి భయంతో అక్కడినుంచి పరిగెత్తి రైల్వే సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు.. అతడిని కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

click me!