ఇదేం పామురా బాబు.. కాటేస్తుందనుకుంటే.. కాలి చెప్పుతో పారిపోయింది... !!

Published : Nov 25, 2022, 12:32 PM IST
ఇదేం పామురా బాబు.. కాటేస్తుందనుకుంటే.. కాలి చెప్పుతో పారిపోయింది... !!

సారాంశం

చెప్పును నోట కరుచుకుని పారిపోతున్న పాము వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. చెప్పును నోట కరుచుకున్న ఓ పాము పరిగెత్తడం కనిపిస్తుంది. ఈ చెప్పుతో ఆ పాము ఏం పనో తెలియదు కానీ.. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి  ఒకరు షేర్ చేశారు. ఇప్పుడిది లక్షకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ పాము జనావాసాల్లోకి వస్తుంది. అది చూసి వారంతా గట్టిగా కేకలు వేస్తూ.. భయంతో పరుగులు తీస్తుంటారు. ఆ పాము మాత్రం అక్కడున్న ఓ చప్పల్ ను నోట కరుచుకుని పారిపోతుంది. పాము అలా చేయడం ఇప్పటివరకు చూడలేదంటూ ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. 

‘ఇంత భయపెట్టింది చెప్పు కోసమా.. ఇంతకీ పాముకు కాళ్లే లేవుకదా.. ఈ చెప్పును ఏం చేసుకుంటుంది.. నాకైతే తెలియదు..’అంటూ కామెంట్ పెడుతూ పర్వీన్ కస్వాన్ వీడియోను షేర్ చేశారు. ఇక దీనిమీద కామెంట్ల ప్రహసనం మొదలయ్యింది. అంతేకాదు ఈ వీడియో ఎక్కడ జరిగిందో ప్రాంతం గురించి తెలుసుకోవడానికి అందులోని మనుషులు మాట్లాడే యాసను కూడా ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. 

 

PREV
click me!

Recommended Stories

Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్
Viral Video: ఇదేందయ్య‌ ఇది.! సెక్యూరిటీకే సెక్యూరిటా.. వీడియో చూస్తే ప‌డి ప‌డి న‌వ్వాల్సిందే