ప్రయాణంలో విషాదం.. కొండపల్లి ఖిల్లా ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం

By Prashanth M  |  First Published Nov 18, 2019, 9:10 PM IST

కృష్ణాజిల్లా కొండపల్లి ఖిల్లా ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం...

కార్తీకమాసం సందర్భంగా కొండపల్లి ఖిల్లాకు ఆదివారం వచ్చిన పట్టు శ్రీనివాసరావు, రవి కుమార్ కుటుంబ సభ్యులు...


కృష్ణాజిల్లా కొండపల్లి ఖిల్లా ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం చోటుచేసుకుంది.  కార్తీకమాసం సందర్భంగా కొండపల్లి ఖిల్లాకు ఆదివారం పట్టు శ్రీనివాసరావు, రవి కుమార్ కుటుంబ సభ్యులు వచ్చారు. తిరుగు ప్రయాణం లో ఖిల్లా ఘాట్ రోడ్డులో అదుపు తప్పి వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. 

దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో 7 గురికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. వెంటనే స్థానికులు బాధితులను చికిత్సనిమిత్తం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఖిల్లాపై సరైన వసతులు లేవంటూ సిఐటియు మండల కార్యదర్శి మహేష్ మండిపడ్డారు. గతంలోనే అనేక ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖిల్లా రోడ్డు కిరువైపులా చెట్లు గుబురుగా పెరిగిపోయి,  ప్రమాద సూచికలు తెలిపే బోర్డులు లేవని విమర్శలు చేశారు.

Latest Videos

undefined

also read: కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... మూడు లారీలు, ఓ బస్సు ఢీ

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరుకుల్ల వద్ద మూడు లారీలు ఓ ఆర్టీసి బస్సు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. 

ఇరుకుల్ల వద్ద మొదట వేగంగా వెళుతున్న లారీ ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో వాటి వెనకాల వున్న మరో రెండు లారీలు కూడా అదుపుతప్పి ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఇలా మూడు లారీలు, బస్సు ప్రమాదానికి గురయ్యాయి. 

"

అయితే బస్సులోని ప్రయాణికులకు గానీ, లారీల్లోని వారికి గానీ ఎలాంటి పెద్ద గాయాలు కాలేవు. చాలామంది సురక్షితంగా బయటపడగా  కొందరికి మాత్రం స్వల్పంగా గాయలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

video news : రాజీవ్ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి

ఈ  ప్రమాదం కారణంగా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మొదట గాయపడినవారిని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అనంతరం వాహనాలకు రోడ్డుపైనుండి పక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

read more  భర్త మాజీ భార్యను గేలిచేసిన మహిళ... అరెస్ట్

ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని ప్రత్యక్షసాక్షులు, ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి  ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

ఇదే కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం కూడా ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అలుగునూరు సమీపంలో రాజీవ్ రహదారిపై లారీ, బైక్  లు ఢీకొన్నాయి.  మితిమీరిన వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొన్నాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ కరీంనగర్ పట్టణానికి చెందిన సాయి కిరణ్(20), సాయి కృష్ణ(22) గా గుర్తించారు. 

 

click me!