రైతులకు ఇంత సాయం ఎవరు చెయ్యలేదు: మంత్రి కన్న బాబు

By Prashanth M  |  First Published Nov 18, 2019, 5:52 PM IST

మంత్రి కన్న బాబు ముఖ్యమంత్రితో చర్చల అనంతరం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.  అనేక వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించినట్లు చెప్పారు.  


కన్నబాబు మాట్లాడుతూ.. "45 లక్షల కుటుంబాలకు రైతు బరోసా అందింది. మరో లక్ష పైగా రైతుల వివరాలు RTGS కు పంపాం. వచ్చే ఏడాది నుండి అందరూ రైతులకు లబ్ది చేకురుతుంది కౌలు రైతులకు సహాయం చేయడం దేశం లోనే మొట్టమొదటి సారి కేవలం 5 నెలల కాలంలో ఎవరు రైతులకు ఇంత సాయం చెయ్యలేదు. అందరూ ఎన్నికల ముందు చేసినవారే ప్రతి గ్రామం లో అగ్రి ఇన్పుట్ షాప్ లు జనవరి ఒకటి నుండి ప్రారంభిస్తాం.

 

Latest Videos

undefined

షాప్ పక్కనే వర్క్ షాప్ ఏర్పాటు చేయబడుతుంది వ్యవసాయం కు సంబంధించి సాంకేతికతను, మార్కెటింగ్ ను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు   చిరు ధాన్యాలు ప్రాసెసింగ్ కు తక్షనమే చర్యలు తీసుకోమని జగన్ ఆదేశించారు  సాగు కర్చుని పారిగణం లోకి తీసుకుని కొనుగోలు ధరలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చెప్పారు. టమాటో ధర తగ్గిన వెంటనే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేశాం.

read also: వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ 

నాడు నేడు కమార్కెట్ యార్డులో కూడా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు   రైతు బజారులను బలోపేతం చేస్తాం, నూతనం గా మరో 56 రైతు బజారులు ఏర్పాటు చేస్తాం. బయో పెస్టిసైడ్ లో ఎంత నిజాయితీ ఉందో తెలియడం లేదు. 400 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్నట్టు అంచనా.  AP బయో ప్రాడక్ట్ రెగ్యులేటరీ యాక్టు కు శ్రీకారం చుట్టాలని నిర్ణయించాం. వన్యప్రాణుల నుంచి పంటల రక్షణకు సమగ్ర కార్యాచరణకు నిర్ణయం" అని వివరించారు. 

click me!