నూజివీడులో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య... అలా చేయవద్దంటూ సూసైడ్ నోట్

Arun Kumar P   | Asianet News
Published : Jan 30, 2020, 05:32 PM ISTUpdated : Jan 30, 2020, 05:37 PM IST
నూజివీడులో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య... అలా చేయవద్దంటూ సూసైడ్ నోట్

సారాంశం

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదివే యువతి హాస్టల్ గదిలో ఉరేేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

కృష్ణా జిల్లా నూజివీడులో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీఫార్మసి చదువుతున్న శైలు అనే యువతి హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో ఒంటరిగా వున్న సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని యువతి బలన్మరణానికి పాల్పడింది.    

శైలు ఆత్మహత్యను గుర్తించిన తోటి విద్యార్ధులు కాలేజి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

బాలిక గదిలో ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. తన చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని పోలీసులకు, తల్లిదండ్రులను కోరుతున్నట్లు యువతి ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. 

read more  అమరావతిలో విషాదం...మద్యంలో పురుగుల మందు, ఇద్దరు మృతి

మృతురాలు విజయవాడకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. పట్టణంలో సిద్దార్థ్ కాలేజీలో బీఫార్మసి రెండో  సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే శైలు మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై వుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌