సరిలేరు నీకెవ్వరు... సినిమా డైలాగులతో జగన్ పై బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Jan 30, 2020, 02:28 PM ISTUpdated : Jan 30, 2020, 02:32 PM IST
సరిలేరు నీకెవ్వరు... సినిమా డైలాగులతో జగన్ పై బుద్దా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

టిడిపి అధికార  ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి తన ట్వీట్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. అయితే ఈసారి కాస్త వెరైటీగా సినిమా డైలాగులతో రెచ్చిపోయారు. 

విజయవాడ: టిడిపి ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. ఈసారి సరిలేరు నీకెవ్వరు సినిమా డైలాగులతో ముఖ్యమంత్రి  పాలనపై సెటైర్లు విసిరారు. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు  వెంకన్న ట్విట్టర్ వేదికన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
 
''వైకాపా మార్ఫింగ్ ట్రిక్స్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. వైఎస్ జగన్ గారు దొంగ అయితే అంతకంటే పెద్ద దొంగలు అని వైకాపా కార్యకర్తలు నిరూపించుకుంటున్నారు. ఆయన వేసే ముష్టి 5 రూపాయిల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు.''

''ఆరోపణలు చేసుకోండి అంతే కాని ఇలాంటి చిల్లర పనులు చెయ్యకండి. ఇదే కొనసాగితే మీ అధినేత జగన్ దొంగ బతుకు బయటపెడుతూనే ఉంటా.. ''

read more భార్యను చంపి, రాత్రంతా శవం పక్కనే నిద్రించి....
 
''బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్తే తడుపుకొని మండలి రద్దు చేసిన మీరా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడేది? 151 మంది ఉన్నాం అని చెప్పి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నప్పుడే మీ వాడికి సీన్ లేదు అని అర్థం అయ్యింది.''
 
 ''క్షుద్ర పూజలకు బ్రాండ్ అంబాసిడర్ మీరే కదా విజయసాయి రెడ్డి గారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని క్షుద్ర పూజలు చేయించావు. ఇప్పుడు ఆయన తీసుకున్న తుగ్లక్ మూడు ముక్కలాట గట్టు ఎక్కాలని కాళహస్తి దేవాలయంలో క్షుద్ర పూజలు చేయించారు.''

read more  విశాఖలో వైసీపీ నేతలు భూదందా... కేవలం 9నెలల్లో 30వేల ఎకరాలు: బోండా ఉమ

''ఇన్ని చేయించినా మీ చెత్త నిర్ణయాలకు దైవం అడ్డుపడింది. మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లో వీలైనంత త్వరగా పాస్ చేయించుకోవాలి అని కలలు కంటున్నావు.''
 
''అభివృద్ధి ప్రణాళిక లేకుండా నువ్వు మొదలు పెట్టిన మూడు ముక్కలాట గురించి ప్రజలకు అర్ధం అయ్యింది. అన్నకి ఇచ్చింది ఒక్క ఛాన్సే అదే ఆయనకి లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు.'' అంటూ వెంకన్న వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌