జీ.ఎన్.రావు కమిటీ నివేదికను సాకుగా చూపుతూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడతామని చెబుతున్న జగన్ ప్రభుత్వం అదే విశాఖ నగరం బ్రాండ్ విలువను మంటగలిపేలా నిర్ణయాలు తీసుకుంటోందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు.
గుంటూరు: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో తయారైన నివేదికపై గుడ్డిగా సంతకాలు చేసిన జీఎన్.రావు ఆయన కమిటీలోని సభ్యులు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పొందిన విశాఖ నగరాన్ని ఎందుకూ పనికిరాని నగరంగా తమ నివేదికలో పేర్కొన్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ రరావు మండిపడ్డారు.
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీ.ఎన్.రావు కమిటీ నివేదికను సాకుగా చూపుతూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడతామని చెబుతున్న జగన్ ప్రభుత్వం అదే విశాఖ నగరానికి తుపాన్ల ముప్పు ఎక్కువని, అక్కడ కాలుష్యం అధికమని, ఆ నగరం నివాసానికి అనుకూలం కాదని జీ.ఎన్.రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం సమాధానం చెబుతుందని బొండా ప్రశ్నించారు.
undefined
ప్రభుత్వచర్యలను, జీ.ఎన్.రావు నివేదికను చూస్తుంటే, ఆయనిచ్చిన నివేదికకు తలాతోక లేదని, ఆయన తీసేసిన తహసీల్దార్ లాంటివాడని అర్థమవుతోందన్నారు. జీ.ఎన్.రావు, బోస్టన్‌కమిటీ నివేదికలు అంత విశ్వసనీయత కలిగినవే అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ ప్రభుత్వం ఎందుకు సంకోచిందని ఉమా ప్రశ్నించారు.
జీఎన్.రావు కమిటీ నివేదికకు, కమిటీలోని సభ్యులు చెబుతున్న అంశాలకు, బయట మాట్లాడుతున్న తీరుకి ఎక్కడా పొంతనఉండటం లేదన్నారు. గతేడాది అక్టోబర్ 13న జీ.ఎన్.రావు కమిటీవేస్తే 6రోజుల్లో 13 జిల్లాలను చుట్టేశారని, అంతిమంగా వైసీపీ తయారు చేసిన దానిపై బృందసభ్యులు సంతకాలు చేశారన్నారు.
read more
శివరామకృష్ణన్ కమిటీ 13జిల్లాల్లో పూర్తిస్థాయిలో పర్యటించి, ఏ ప్రాంతంలో రాజధాని పెడితే మంచిదనే దానిపై సవివరమైన నివేదికను ఇవ్వడం జరిగిందన్నారు. అమరావతిపై ఆదినుంచి కక్షతో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఎవరినీ సంప్రదించకుండా మొక్కుబడిగా కమిటీలువేసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందన్నారు.
విశాఖ నగరాన్ని గడచిన 5ఏళ్లలో అంతర్జాతీయ నగరంగా మార్చడానికి చంద్రబాబు శ్రమించారని, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సు ఏది జరిగినా అక్కడే నిర్వహించేవారన్నారు. అలానే పదిసార్లు తిరిగి విశాఖకు లులూ గ్రూప్‌ని తీసుకొచ్చారని, 70వేలకోట్ల పెట్టుబడిపెట్టే ఆదానీ డేటాసెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇతర ఫార్మా పరిశ్రమల్ని ఏర్పాటు చేశారని ఉమా పేర్కొన్నారు.
సాగర నగరాన్ని హుద్‌హుద్ కబళించినప్పుడు, వారంరోజులు అక్కడే ఉండి నగరం బాగుపడేవరకు అన్నిశాఖల అధికారులతో కలిసి రేయింబవళ్లు పనిచేశారన్నారు. విశాఖనగరం నివాసానికి పనికిరాదా..? అలాంటి విశాఖ నగరం నివాసానికి అనుకూలం కాదని, అది కోస్టల్‌జోన్ ఏరియాలో ఉందని, అక్కడున్న పోర్టు, ఉక్కుపరిశ్రమ, నేవీ జలాంతర్గాముల కారణంగా కాలుష్యం ఎక్కువని, సముద్రజలాలు ముంచుకొస్తున్నకారణంగా తాగునీరు ఉప్పునీటిగా మారుతుందని, జీ.ఎన్.రావుకమిటీ తన నివేదికలో చెప్పడం దుర్మార్గం కాదా అని బొండా నిలదీశారు.
ఒకవైపు కమిటీలపేరుతో ఇలాంటి నివేదికలు ఇస్తూ, మరోవైపు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పేరుతో ఎందుకు నాటకాలు ఆడుతున్నా రని ఆయన ప్రశ్నించారు. నివేదికలోని తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, విశాఖలో కాకుండా కాస్తదూరంగా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్‌దాటి దూరంగా రాజధాని పెట్టవచ్చని సూచిస్తున్నారని, అలాపెట్టేట్టయితే మిలీనియం టవర్స్‌ని ఎందుకు ఎంపిక చేసుకున్నారని, దీన్నిబట్టే జీ.ఎన్.రావు కమిటీకి ఉన్న అవగాహనేమిటో అర్థంచేసుకోవచ్చన్నారు.
జగన్ పాలన మరో ఏడాదే... ఆ తర్వాత జైలుకే...: దేవినేని ఉమ సంచలనం
అటు విశాఖవాసుల్ని, ఇటు రాష్ట్రప్రజల్ని మోసం చేయడానికే ప్రభుత్వం ఇలా నాటకాలు ఆడుతోందని, విశాఖపై ఆ విధంగా దుష్ప్రచారంచేస్తే, భవిష్యత్‌లో ఎవరైనా అక్కడ పెట్టుబడులు పెడతారా అని ఉమా వాపోయారు. అమరావతిని చంపేయాలన్న తహతహ తప్ప, రాజధాని తరలింపులో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధిలేదన్నారు.
కొట్టేసిన భూముల విలువ పెంచుకోవడానికే 9నెలల్లో విశాఖకేంద్రంగా 30వేల ఎకరాలు కొట్టేశారని, వాటి విలువ పెంచుకోవడానికి తనబంధువుల కంపెనీ అరబిందో ఫార్మాకింద ఉన్న భూములు అమ్ముకోవడానికి, వాల్తేర్ క్లబ్‌ని మింగేయడానికి, దసపల్లా భూముల్ని భోంచేయడానికే ప్రభుత్వం విశాఖ జపం చేస్తోందని బొండా పేర్కొన్నారు.
విజయమ్మ విశాఖలో పోటీచేసినప్పుడు, ఆ నగరమంతా గడగడలాడిపోయిందని, పంచెకట్టు బ్యాచ్‌చేసిన అరాచకం అంతాఇంతా కాదన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పేరుతో ప్రభుత్వం అక్కడ స్పెక్యులేషన్ మొదలెట్టి, భూములవిలువను పెంచుతోందన్నారు. రియల్‌ఎస్టేట్‌ముసుగులో రాజధానిని తరలించే కుట్రకు జగన్‌సర్కారు తెరలేపిందని, అందుకు బూచిగా జీ.ఎన్.రావు, బోస్టన్‌కమిటీలను, బ్రెయిన్‌లెస్ హైపవర్‌కమిటీలను చూపిందన్నారు.
విశాఖనగరాన్ని కించపరుస్తూ జీ.ఎన్.రావు కమిటీని వేదికఇస్తే, దాన్ని మంత్రులు, అధికారులు ఉన్న హైపవర్‌కమిటీ ఏం పరిశీలించిందన్నారు. కర్నూల్లో హైకోర్టు పెడతామని జగన్‌సర్కారు చెబుతుంటే, జీ.ఎన్.రావుకమిటీలో మాత్రం హైకోర్టు ఏర్పాటనేది, సుప్రీంకోర్టు అంతిమనిర్ణయమని పేజీనెం-76లో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. కర్నూలు ప్రజలని మోసగించడానికే ఇలా చెబుతున్నారని, కర్నూల్లో, అమరావతిలో పెట్టడానికి అవేమైనా భారతిసిమెంట్ కంపెనీ బ్రాంచ్‌లా అని బొండా ఎద్దేవాచేశారు.
ఏకమిటీ రిపోర్టు బయటకురాదన్న ఉద్దేశంతో వాటినిదాచేసి, ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళుతోందన్నారు. రైతులు కోర్టుకువెళ్లబట్టే, కమిటీల నివేదికలు బయటకు వచ్చాయని, దాంతో జగన్‌సర్కారు బండారం బయటపడిందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై హైకోర్టు చాలాస్పష్టమైన ఆదేశాలిచ్చిందని, తాముచెప్పేవరకు ఏవిభాగాన్ని తరలించినా లారీకెత్తిన సామాన్లబాడుగతో సహా అధికారులనుంచి వసూలుచేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.
తుపాన్లు వస్తే, వెంటనే పోతాయని, వరదలొస్తే ఎప్పటికీపోవని చెబుతున్న బిత్తరసత్తి (మంత్రిబొత్స) ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదని, అసలు ఆయనకు తుపాన్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసునాఅని ఉమా మండిపడ్డారు. శ్రీకాకుళంలో తిత్లీ వచ్చినప్పుడు, పక్కనేఉన్న జగన్, పక్కజిల్లాలో ఉన్న బొత్స ఏంచేశారన్నారు. ఒక నగర నిర్మాణమంటే లోటస్‌పాండ్ కట్టినంతతేలికకాదనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గ్రహించడం లేదన్నారు.
రాష్ట్రంలో వివిధప్రభుత్వవిభాగాల కింద 130శాఖలున్నాయని, అవన్నీ విశాఖలో పెట్టినంత మాత్రాన నగరం రూపురేఖలు మారుతాయా అని ఉమా ప్రశ్నించా రు. ప్రజాభిప్రాయం ప్రకారమే ఈ కమిటీలన్నీ పనిచేసి ఉంటే, అవి ఇచ్చిన నివేదికల్ని ప్రభుత్వం ప్రజలముందు ఎందుకు పెట్టలేదన్నారు. ఒకేరాష్ట్రం-ఒకేరాజధాని నినాదమే అంతిమమని, దాన్ని అమలుచేసేవరకు పార్టీలు, ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని బొండా తేల్చిచెప్పారు.