నాలుగు బిల్డింగులు..ముళ్లపొదలు తప్ప అమరావతిలో ఏమున్నాయ్: కొడాలి నాని

By Siva KodatiFirst Published Nov 26, 2019, 8:15 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. రాజధాని ప్రాంతంలో నాలుగు బిల్డింగులు, ముళ్లపొదలు తప్ప ఏమున్నాయని నాని ప్రశ్నించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. రాజధాని ప్రాంతంలో నాలుగు బిల్డింగులు, ముళ్లపొదలు తప్ప ఏమున్నాయని నాని ప్రశ్నించారు.

వాటిని చూసేందుకే చంద్రబాబు వెళ్తున్నారా అని ఆయన నిలదీశారు. గత ఐదేళ్లలో సమీక్షలు తప్ప చంద్రబాబు ఏం చేయలేదని.. వైసీపీని విమర్శించడం మాని ఎందుకు ఓడామో సమీక్షించుకోవాలని నాని సూచించారు.

హైదరాబాద్ తరహా రాజధానిని నిర్మిస్తామని చెప్పి బాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పొరపాట్లే మేం కూడా చేయాలా అని నాని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో ఇల్లే కట్టలేం.. అలాంటిది రాజధాని కట్టగలమా అని ఆయన నిలదీశారు.

Also Read:వంశీ లాస్ట్ ఆప్షన్ అదే: వైసీపీ రివేంజ్, కొరకరాని కొయ్యగా వల్లభనేని

సాయంత్రం 6 గంటల తర్వాత అమరావతిలో స్మశాన నిశ్శబ్ధం ఉంటుందని బొత్స అన్నారన్నారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శించుకోవాలని చెప్పినా చంద్రబాబు వినలేదని.. బాబు వల్లే తాము కూడా ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సి వస్తోందని నాని గుర్తు చేశారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై ఫైర్ అయ్యారు.  కేవలం బొత్సాపైనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసారు. 

ఇందులో భాగంగా "ఇన్ని రోజులూ  ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా... అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. అయినా బొత్సాగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు." అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

Also Read:ఏపీ రాజకీయాల్లో సంచలనం: జగన్ చెంతకు ముగ్గురు మిత్రులు, ఆ హామీపైనే వెయిటింగ్

తాము అమరావతిని నిర్మించడానికి పడిన కష్టం వైకాపా నేతలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. అంతేగాక ఈ విషయాన్ని ఉద్దేశించి "ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు." అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

click me!