పోలవరం నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఒకటి మాట్లాడితే మంత్రి అనిల్ మరొకటి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనను కూడా ఆయన తప్పుబడుతున్నారని తెలిపారు.
అమరావతి: ఇరిగేషన్ మంత్రి అనిల్ పోలవరం వెళ్లి వంకర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇటీవల స్వయంగా సీఎం జగన్ పోలవరంపై జరిపిన సమీక్షలో 66.90 శాతం పూర్తి అయ్యిందని స్వయంగా వెల్లడించారు. అలాగే నవంబర్ 18న రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి పోలవరం ప్రాజెక్టు 67.09 శాతం పూర్తి అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం చెప్పారు. వీటన్నింటిని కాదని మంత్రి కొత్త లెక్కలు చెప్పడం ఆయన అవగాహనలేమిని తెలియజేస్తుందని ఉమ ఎద్దేవా చేశారు.
ముందు ఇరిగేషన్ శాఖ లో అసలు ఏమి జరుగుతుందో మంత్రి తెలుసుకోవాలని సూచించారు. అలాకాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిదికాదని... ఇప్పటికైనా కాస్త అవగాహన తెచ్చుకో అంటూ అనిల్ కుమార్ ను ఉమ హెచ్చరించారు.
undefined
తమ హయాంలోనే పోలవరంలో రూ.11500 కోట్లు పనులు చేసామని...అందులో కేంద్రం నుంచి రూ.5500 కోట్లు బకాయిలు రావాల్సి వుందని తెలిపారు. కేంద్రం నుంచి ఈ నిధులు ఎందుకు తీసుకు రావడం లేదని... ఇది వారి చేతకానితనం, అసమర్థతకు నిదర్శనమన్నారు.
కోట్లాదిమంది హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా జగన్ మంత్రుల చేత మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే టిటిడి చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి ఎక్కడ ఉన్నారని...ఆయన స్పందించి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని...లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జలవనరుల శాఖలో చెల్లింపులు ఏయే ఏజెన్సీలకు ఇచ్చారో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
జగన్ కు పొంచివున్న ప్రమాదం... చంద్రబాబును విచారించాలి: వైసిపి ఎమ్మెల్యే డిమాండ్
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు అమరావతి పర్యటన తో జగన్ వెన్నులో వణుకు వస్తోందిని... ఈ పర్యటనపై ప్రకటన వెలువడిన అనంతరమే పనులు చేయాలనే విషయం సీఎంకి గుర్తొచ్చిందన్నారు.
''జగన్ ది ''కంత్రి''వర్గం... ముందు బూతు మీడియం తర్వాతే ఇంగ్లీష్ మీడియం''
రైతుల త్యాగాలను బొత్స స్మశానం తో పోల్చటం దుర్మార్గమన్నారు, ఎన్నో చట్టాలు శాసనసభ లో ఆమోదం పొందితే అది స్మశానం లా కనిపిస్తోందా... అని బొత్సను ఉమ ప్రశ్నించారు.
అమరావతి లో ఇటుక కూడా పెట్టలేదని మమ్మల్ని విమర్శించారని... అయితే సోమవారం జరిగిన సమీక్షలో మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. అమరావతి ని శ్మశానంగా పోల్చడంతో పాటు భూములు ఇచ్చిన రైతులను అవమానించిన మంత్రి బొత్స వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.