ఆర్టీసి బస్సు-ఆటో ఢీ... మహిళ కడుపులోకి దూసుకెళ్లిన రాడ్

Published : Nov 26, 2019, 05:03 PM ISTUpdated : Nov 26, 2019, 05:08 PM IST
ఆర్టీసి బస్సు-ఆటో ఢీ... మహిళ కడుపులోకి దూసుకెళ్లిన రాడ్

సారాంశం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్ట ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ మహిళ అత్యంత ప్రమాదకర రీతిలో గాయపడింది.  

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళుతున్న ఓ ఆర్టీసి బస్సు, ఆటోలు  ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ అత్యంత ప్రమాదకరరీతిలో గాయపడి కొనఊపిరితో చికిత్స పొందుతోంది. 

విజయవాడ నుండి అవనిగడ్డ వైపు వెళుతున్న కరకట్ట బస్సు పులిగడ్డ వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా నల్లపాడుకి చెందిన మేడా యేసమ్మ (45) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కడుపులోకి బస్సు అల్యూమీనియం రాడ్డు దూసుకెళ్లింది.  

 read more స్కూటీని ఢీకొన్న ఆర్టీసి బస్సు...టీసిఎస్ ఉద్యోగిని మృతి, డ్రైవర్ పై రాళ్లదాడి

తీవ్రంగా గాయపడ్డ ఆమెను అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ  చికిత్స అందించారు. ఆ తర్వాత మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.  ఆమె శరీరంలోంచి రాడ్డును బయటకు తీసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. 

ఈ ప్రమాదంలో మరికొందరు ప్రయాణికులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానం గురించి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. 

read more  విషాదం... పాముకాటుతో మహిళ మృతి

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌