చంద్రబాబు తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు టీడీపి నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగా నోవా టెల్ హోటల్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన భూమా అఖిలప్రియను కూడా హౌస్ అరెస్టు చేశారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టీడీపి తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో భాగంగా ఆ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అఖిలప్రియను కూడా హౌస్ అరెస్టు చేశారు
నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన అఖిలప్రియను పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అఖిలప్రియకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి గదిని కూడా పోలీసులు తనిఖీ చేశారు.
తన సోదరుడి గదిని తనిఖీ చేయడంపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపి నేతలు బయటకు రాకుండా వారిని పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు
టీడీపి శిబిరం నుంచి మీడియా ప్రతినిధులను బలవతంగంగా బయటకు పంచించారు. వైసిపి దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ టీడీపి చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తలపెట్టింది.
సంబంధిత వార్తలు
చలో ఆత్మకూరు ఎఫెక్ట్: చంద్రబాబునాయుడు హౌజ్ అరెస్ట్, నిరహార దీక్ష
గుంటూరులో టెన్షన్: టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్
తాడోపేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టను: జగన్ సర్కార్ పై చంద్రబాబు గరంగరం
వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు