చంద్రబాబు సర్కార్ అవినీతి చేస్తే సీబీఐ విచారణ జరిపించండి: ఎంపీ కేశినేని నాని

By Nagaraju penumala  |  First Published Sep 7, 2019, 3:11 PM IST

జగన్ 100 రోజుల పాలనలో తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అలాగే ప్రజావేదికను కూల్చి వేశారంటూ చెప్పుకొచ్చారు. ఇవి తప్ప ఇంకేమీ కనబడటం లేదన్నారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ 100 రోజుల పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. జగన్ వందరోజుల పాలనలో వంద నిర్ణయాలు తీసుకున్నారంటూ విమర్శించారు. నిర్ణయాల అమలులో జగన్ పూర్తిగా విఫలమయ్యాయరంటూ ధ్వజమెత్తారు. 

జగన్ 100 రోజుల పాలనలో తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అలాగే ప్రజావేదికను కూల్చి వేశారంటూ చెప్పుకొచ్చారు. ఇవి తప్ప ఇంకేమీ కనబడటం లేదన్నారు. 

Latest Videos

ఇకపోతే రాజధాని నిర్మాణ పనులు నిలిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు.  
 
ఈ వార్తలు కూడా చదవండి

రాజధానిపై గెజిట్ లేదన్న బొత్స: సెక్రటేరియట్ లో ఎందుకున్నారంటూ యనమల కౌంటర్

అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందా...?: రాజధానిపై బొత్స వ్యాఖ్యలు

click me!