అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అదిరిపోయే ఆటతో భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ గా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ఇదే గ్రౌండ్ లో భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.