Feb 7, 2020, 9:49 PM IST
వరంగల్ జిల్లాలోని మేడారం జనసంద్రంతో నిండిపోయింది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు తెలంగాణ నలుమూలల నుండే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి గిరిజన బిడ్డలు మేడారం బాటపట్టారు. దీంతో జాతర ప్రాంతమైన భక్తులతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా శుక్రవారమైన ఇవాళ అమ్మవార్ల గద్దెల వద్ద భక్తుల కోలాహలం మరి ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లా పాపలతో కలిసివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది.