గ్యాస్ భారాన్ని భుజాన మోస్తూ...... సూర్యాపేటలో టీఆర్ఎస్ మహిళల భారీ ర్యాలీ

Mar 24, 2022, 3:46 PM IST

సూర్యాపేట: గ్యాస్ ధరను మరోసారి పెంచి సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరింత బారాన్ని మోపడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ(గురువారం) ఆందోళన చేపట్టాయి. పార్టీ పిలుపుమేరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు పెద్దఎత్తును ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా సూర్యాపేట పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. కొందరు మహిళలు ఏకంగా గ్యాస్ సిలిండర్ మోస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం నుండి మొదలైన మహిళల ప్రదర్శన శంకర్ విలాస్, యంజి రోడ్, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుంది. అక్కడ మహిళలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసారు.