రాష్ట్రపతి ముర్ముకు బండి సంజయ్ ను పరిచయం చేసిన కేసీఆర్...

Dec 27, 2022, 12:52 PM IST

 హైదరాబాద్ : భారత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణ విచ్చేసిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. ఇలా చాలాకాలం తర్వాత  గవర్నర్, సీఎం ఒకే దగ్గర కనిపించారు. ఇక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక రాజకీయ నాయకులను స్వయంగా పరిచయం చేసారు. ఇలా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా రాష్ట్రపతికి పరిచయం చేసారు సీఎం కేసీఆర్.