Jul 1, 2021, 12:56 PM IST
గుంటూరు: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ముదురుతోంది. ఇప్పటికే నదీ జలాల కోసం తెలంగాణ-ఏపీల ఘర్షణ వాతావరణ నెలకొంది. దీంతో ఇరు రాష్ట్రాలు సరిహద్దుల్లో గల ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులు మొహరించారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన చేస్తోంది. అయితే తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కు ఇరువైపుల ఏపీ, తెలంగాణ పోలీసుల మోహరించడంతో సాగర్ లో టెంక్షన్ వాతావరణం నెలకొంది.