
ఐటీ, బయోటెక్ హబ్‌గా ఎదిగిన భాగ్యనగరం.. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టింది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రంగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఫ్యాక్టరీని వర్చువల్‌గా ప్రారంభించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దాదాపు 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.