సికింద్రాబాద్ లో మరో ఘోరం... స్వప్నలోక్ లో చెలరేగిన మంటలు, ఆరుగురు దుర్మరణం

సికింద్రాబాద్ లో మరో ఘోరం... స్వప్నలోక్ లో చెలరేగిన మంటలు, ఆరుగురు దుర్మరణం

Published : Mar 17, 2023, 10:26 AM IST

 హైదరాబాద్ : ఇటీవల డెక్కన్ మాల్ అగ్నిప్రమాదం ఘటన మరువకముందే సికింద్రాబాద్ లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

 హైదరాబాద్ : ఇటీవల డెక్కన్ మాల్ అగ్నిప్రమాదం ఘటన మరువకముందే సికింద్రాబాద్ లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని వస్త్ర దుకాణాలతో పాటు పలు ప్రైవేట్ కార్యాలయాలకు నిలయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్ మంటల్లో చిక్కుకుంది. నిన్న(గురువారం) సాయంత్రం కాంప్లెక్స్ లోని ఎనిమిద అంతస్తులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమైన కాంప్లెక్స్ మొత్తానికి వ్యాపించాయి. ఇలా నిత్యంరద్దీగా వుండే కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటల చెలరేగి పొగలు వ్యాపించడంతో భయానక వాతావరణం ఏర్పడింది. చాలామంది ప్రమాదాన్ని గుర్తించి వెంటనే బయటకు రాగా కొందరు అందులోనే చిక్కుకున్నారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడగా ఆరుగురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మృతులు ప్రమీల(22),వెన్నెల(22), శ్రావణి(22), త్రివేణి(22), శివ(22), ప్రశాంత్‌ (23)గా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపుచేసారు. పదుల సంఖ్యలో ఫైరింజన్లు మంటలను అదుపుచేయడానికి ఉపయోగించాల్సి వచ్చింది. జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైదరాబాద్ లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

06:02లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో కేటీఆర్ | KTR | Lal Darwaza Bonalu Celebrations
07:18Peddi Sudarshan Reddy కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం | KCR | Asianet News Telugu
02:34బంగాళాఖాతంలో అల్పపీడనం...ఇక ఏపీలో దంచుడే | Asianet News Telugu
03:47తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు | AP & Telangana Rain Alert Today
08:43తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
03:56భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu
651:45Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
09:34Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
16:14ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
07:07సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026