Jul 17, 2022, 8:01 PM IST
హైదరాబాద్ : ఆషాడమాస బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు పిల్లాపాపలతో తరలివస్తున్న భక్తులతో సికింద్రాబాద్ ప్రాంతం సందడిగా మారింది. ముఖ్యంగా మహిళలు తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అయిన బోనమెత్తి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు. తెల్లవారుజామునే మంత్రి తలసాని కుటుంబం మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఇలా సామాన్యులే కాదు వీఐపిలు, రాజకీయ నాయకులు సైతం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత బంగారుమెత్తి భారీ ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. అలాగే టిపిపి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.