
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు మరియు డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి గారు “Arrive Alive” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం, సురక్షితంగా ప్రయాణించాలనే భావనను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా వారు హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచారు.