హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో WDCW & SC శాఖల ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి పాల్గొని, దివ్యాంగులకు వివిధ రకాల అవసరమైన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారిని సమాజంలో సమాన హక్కులతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.