
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తనపై సవాళ్లు విసురుతున్న తీరు సరైంది కాదన్నారు. "ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయటికి నెట్టావ్. ఆమెకే సమాధానం చెప్పలేనివాడివి నాకు సవాల్ విసురుతావా? లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డ. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు" అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.