ములుగు జిల్లా MEDARAM ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్మించిన పైలాన్‌ను సీఎం ప్రారంభించగా, గిరిజన దేవతలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. MEDARAM సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని సీఎం పేర్కొన్నారు.