Galam Venkata Rao | Published: Mar 31, 2025, 8:00 PM IST
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ దేవాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.