మున్నూరు కాపు ప్రజాప్రతినిధులను సన్మానించిన మంత్రి గంగుల

Mar 25, 2022, 5:02 PM IST

హైదరాబాద్: రాజకీయాల్లో రాణిస్తున్న రాష్ట్రస్థాయిలో వివిధ హోదాల్లో కొనసాగుతున్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం జరిగింది. మున్నూరు కాపు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ దండె విఠల్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, తెలంగాణ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితర మున్నూరు కాపు నాయకులను మంత్రి సన్మానించారు. అనంతరం మంత్రి గంగులకు నిర్వాహకులు సన్మానం చేశారు.