భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ప్రారంభానికి సిద్ధమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 28 నుండి 31 వరకు మేడారం అసలైన జనసంద్రంగా మారనుంది.