బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసే లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే ఎదురు దెబ్బలను ఏమాత్రం పట్టించుకోమని, ప్రజలే తమ బలం అని కేటీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.