
గురువు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తెలంగాణ సీఎం హైప్ క్రియేట్ చేశారని విమర్శించారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారని, అవి నిజంగా అమలయ్యుంటే కనీసం రూ.10 వేల కోట్లైనా రావాల్సిందని ప్రశ్నించారు. స్టార్ హోటళ్ల వంట మనుషులు కూడా ఎంవోయూలపై సంతకాలు పెట్టారన్నారు.