Galam Venkata Rao | Published: Feb 17, 2025, 5:00 PM IST
కేసీఆర్ కడుపున పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో అని కొనియాడారు. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు ఆయనకు మీడియా లేదు, మద్దతు లేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.