హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర నేతలు హాజరై.. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు.